సేంద్రియ ఎరువులతో అధిక దిగుబడులు | - | Sakshi
Sakshi News home page

సేంద్రియ ఎరువులతో అధిక దిగుబడులు

Feb 5 2026 7:33 AM | Updated on Feb 5 2026 7:33 AM

సేంద్రియ ఎరువులతో అధిక దిగుబడులు

సేంద్రియ ఎరువులతో అధిక దిగుబడులు

కలకడ : సేంద్రియ ఎరువుల వినియోగంతో అధిక దిగుబడి పొందొచ్చని జిల్లా వ్యవసాయశాఖ అధికారి శివనారాయణ అన్నారు. బుధవారం మండలంలోని కోన, కోన పంచాయతీ తిప్పిగారిపల్లె లో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొని రైతులకు పంటసాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. అధికంగా రసాయనిక ఎరువులు వినియోగంచరాదని, వ్యవసాయాధికారుల సూచనలమేరకు తగుమోతాదులో సేంద్రియ ఎరువులు వినియోగించాలని తెలిపారు. ఈ– పంటనమోదు చేసుకుంటేనే ప్రభుత్వ పథకాలు అందుతాయని చెప్పారు. కార్యక్రమంలో మండల వ్యవసాయశాఖ అధికారి యంఆర్‌ శ్రీనివాస్‌, ఆర్‌ఎస్‌కే సిబ్బంది త్రిసూల్‌, ఇంద్రజ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement