ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని స్థానిక న్యాక్ బిల్డింగ్‌లో డీడీయూ–జీకేవై, సీడాప్ సహకారంతో ఇస్తున్న ఉచిత శిక్షణకు నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకోవాలని న్యాక్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎం.రాకేష్ తెలిపారు. ఈ శిక్షణలో సోలార్ పీవీ ఇన్‌స్టాలర్, అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ వృత్తి విద్యా కోర్సులలో శిక్షణ ఇస్తున్నామని, టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, బీటెక్ చదివిన అభ్యర్థులకు న్యాక్ సంస్థలో ఎంపిక పక్రియ ఉంటుందన్నారు. ఈనెల 7వ తేదీలోపు ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాలకు 9985142155, 9010016887, 9989140993 అనే ఫోన్ నెంబర్లకు సంప్రదించాలని సూచించారు.
సింహ వాహనంపై
శ్రీరంగనాథుడు
పులివెందుల టౌన్ : పట్టణంలోని పూలంగళ్ల సర్కిల్ వద్ద ఉన్న శ్రీరంగనాథ కాంప్లెక్స్‌లో నిర్వహించే బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజు సోమవారం శ్రీరంగనాథుడు సతీసమేతుడై రాత్రి సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పురవీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు వస్తుంటే భక్తులు పూజాద్రవ్యాలు కాయ కర్పూరాలను సమర్పించి తమ మొక్కులను తీర్చుకున్నారు. ఉదయం ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణరాజేష్‌శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవ ప్రాంగణంలో భజన బృందం భక్తి గీతాలను ఆలపించారు.
నేడు ప్రమాణ స్వీకారం
రాయచోటి టౌన్ : రాయచోటి శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో మంగళవారం ఆలయ పాలక మండలి కమిటీ చైర్మన్, సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో డీవీ రమణారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు ఆలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమం ఉంటుందని.. ప్రమాణ స్వీకారం చేయడానికి ముందుగా పాలక మండలి సభ్యులు పట్టణంలో భారీ ఊరేగింపుగా వచ్చి ఆలయానికి వస్తారని తెలిపారు. ఈ ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ముఖ్యఅతిధిగా పాల్గొంటారని వివరించారు.
రేపు ఎన్నికలు
చిత్తూరు కార్పొరేషన్ : ఉమ్మడి జిల్లాలోని గుడిపాల, బి.కొత్తకోట మండల పరిషత్ అధ్యక్ష పదవులకు బుధవారం ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆ రోజు మండలాల్లో ఎంపీపీలను ఎంపీటీసీ సభ్యులు ఎన్నుకోనున్నారు. గుడిపాల, బి. కొత్తకోట ఎంపీపీలు ప్రసాద్‌రెడ్డి, లక్ష్మి నరసింహాలు అవిశ్వాస తీర్మానం ద్వారా పదవులు కోల్పోయిన విషయం తెలిసిందే. పదవుల భర్తీకి ఎన్నిక నిర్వహించేందుకు జెడ్పీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు.
చెస్‌లో రేటింగ్ సాధించిన జిల్లా క్రీడాకారులు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : జిల్లాకు క్రీడాకారులు చెస్‌లో సత్తా చాటినట్లు జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి అనీస్ దర్బారి పేర్కొన్నారు. జిల్లాకు చెందిన ధనిత సింధురాజు (ప్రొద్దుటూరు),రీహాన్ (కడప) ఇంటర్నేషనల్ ఫిడే చెస్ రేటింగ్స్ సాధించి జిల్లాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారన్నారు. ప్రొద్దుటూరుకు చెందిన ధనిత సింధురాజు ఇటీవల 1499 ఇంటర్నేషనల్ ఫిడే ర్యాపిడ్ చెస్ రేటింగ్ సాధించిందన్నారు. గత నెలలో బెంగళూరులో నిర్వహించిన ర్యాపిడ్ రేటింగ్ చెస్ టోర్నమెంట్‌లో ఇద్దరు రేటెడ్ క్రీడాకారులపై విజయాలు సాధించడం ద్వారా ఈ ఘన తను అందుకుందని తెలిపారు. అదేవిధంగా కడ పకు చెందిన రీహాన్ 1451 ఇంటర్నేషనల్ క్లాసికల్ చెస్ రేటింగ్ సాధించి ఇంటర్నేషనల్ క్లాసికల్ రేటెడ్ చెస్ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడన్నా రు. గత నెలలో చైన్నె నెహ్రూ స్టేడియం వేదికగా నిర్వహించిన క్లాసికల్ రేటింగ్ చెస్ టోర్నమెంట్ లో రీహాన్ రేటెడ్ క్రీడాకారులపై 4 రేటెడ్ పాయింట్లు సాధించి ఈ విజయాన్ని అందుకున్నారన్నారు. ఒకే సమయంలో జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు అంతర్జాతీయ ఫిడే రేటింగ్స్ సాధించడం ఎంతో గర్వకారణమని తెలిపారు.
ధనిత సింధురాజు రీహాన్
ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం


