శ్రీ వీరభద్రస్వామికి విశేష పూజలు | - | Sakshi
Sakshi News home page

శ్రీ వీరభద్రస్వామికి విశేష పూజలు

Feb 16 2026 7:47 AM | Updated on Feb 16 2026 7:47 AM

శ్రీ వీరభద్రస్వామికి విశేష పూజలు

శ్రీ వీరభద్రస్వామికి విశేష పూజలు

రాయచోటి టౌన్‌ : శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణలో భాగంగా ఆదివారం స్వామివారికి, అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను రంగురంగుల పూలు, బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలతో అందంగా అలంకరించి గజవాహనంపై ఊరేగించారు. అంతకు ముందుగా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అఘోరలింగేశ్వరుడికి విశేష పూజలు నిర్వహించారు. శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణలో భాగంగా శ్రీ వీరభద్రస్వామికి, శ్రీ భద్రకాళీ అమ్మవార్లకు రాష్ట్ర రవాణ, క్రీడలు, యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పట్ట వస్త్రాలు సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement