వైభవంగా కమలాపురం ఉరుసు | - | Sakshi
Sakshi News home page

వైభవంగా కమలాపురం ఉరుసు

Apr 4 2026 7:55 AM | Updated on Apr 4 2026 7:55 AM

కమలాపురం: కమలాపురం పట్టణంలో వెలసిన శ్రీ హజరత్‌ అబ్దుల్‌ గఫార్‌ షా ఖాద్రి, శ్రీ హజరత్‌ మౌలానా మౌల్వి ఖాదర్‌ మొహిద్ధీన్‌ షా ఖాద్రి, శ్రీ హజరత్‌ జహీరుద్ధీన్‌ షా ఖాద్రి ఖుద్దస సిర్రహుం వార్ల ఉరుసు మహోత్సవం వైభవంగా జరిగింది. దర్గా పీఠాధిపతి సజ్జాద్‌–ఏ–నషీన్‌ ఫైజుల్‌ గఫార్‌ షా ఖాద్రి ఆధ్వర్యంలో,దర్గా కన్వీనర్‌ ఇస్మాయిల్‌ పర్యవేక్షణలో శుక్రవారం ప్రధాన ఉరుసు జరిగింది. రాష్ట్రం నలు మూలల నుంచే కాక తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి ముస్లిం, హిందు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉరుసు సందర్భంగా ఏర్పాటు చేసిన ఖవ్వాలీ పోటాపోటీగా సాగింది. ఉరుసు మహోత్సవాన్ని ప్రముఖులు తిలకించారు. వైఎస్సార్‌సీపీ కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి,మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, తదితరులు దర్గాచేరుకున్నారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement