● భక్తిశ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే
● చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు
మదనపల్లె సిటీ: జిల్లా వ్యాప్తంగా గుడ్‌ఫ్రైడే ప్రార్థనలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మదనపల్లెలోని జేసీఎం చర్చి, శానిటోరియంలోని సెయింట్‌లూక్, రవీంద్రనగర్‌లోని హోసన్నా మిషన్ మందిరం, రాయచోటి, పీలేరు,వాల్మీకిపురం, తంబళ్లపల్లె, రాజంపేట,రైల్వేకోడూరు ప్రాంతాల్లోని చర్చిల్లో గుడ్‌ఫ్రైడే వేడుకలు జరిగాయి. లోక రక్షకుడైన క్రీస్తు... సర్వమానవపాప విముక్తి కోసం మరణశిక్ష పొందిన రోజును శుభ శుక్రవారంగా పేర్కొంటూ .క్రైస్తవ విశ్వాసులందరూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భక్తితో 40 రోజుల పాటు ఉపవాసదీక్షలు ఆచరించిన విశ్వాసులు శుక్రవారం వాటిని విరమణ చేశారు. అనంతరం చర్చిలకు తరలివెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
’ప్రజల రక్షణ కోసం ప్రాణత్యాగం
క్రైస్తవ మతగురువులు రెవ. ఆనంద్‌రాజ్ గుడ్‌ఫ్రైడే ప్రాముఖ్యతను వివరించారు. దీనిని ఒక ఒక శుభకార్యంలా కాకుండా క్రీస్తు సంతాపదినంగా జరుపుకొంటారని పేర్కొన్నారు. ఏసుకు శిలువ వేసిన మూడు రోజుల తర్వాత పునరుత్థానాన్ని ఆదివారం రోజు ఈస్టర్‌గా పాటిస్తారని చెప్పారు. క్రెస్తవ సమాజంలో అత్యంత ప్రత్యేకమైన రోజుగా పరిగణిస్తారన్నారు. ప్రజల రక్షణ కోసం క్రీస్తు తన జీవితాన్ని త్యాగం చేశారని పేర్కొన్నారు. క్షమాగుణమే ఏసుక్రీస్తు పరిచర్య అని,ప్రజలందరూ శాంతి సమాధానం కలిగి ఉండాలని కోరారు. అన్ని గుణాలకన్నా క్షమాగుణం గొప్పదన్నారు. క్రీస్తు జీవితం,బోదనలు అందరికి ఆదర్శనీయమన్నారు.


