బి.మఠంలో 7,9న వేలం పాట | - | Sakshi
Sakshi News home page

బి.మఠంలో 7,9న వేలం పాట

Apr 4 2026 7:55 AM | Updated on Apr 4 2026 7:55 AM

బి.మఠంలో 7,9న వేలం పాట రామయ్యకు సారె డిసెట్‌–2026 కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

బ్రహ్మంగారిమఠం: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీపోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం పరిధిలో 7 న ఉదయం 10గంటలకు టోల్‌ గేట్‌ రుసుం కోసం వేలం పాట నిర్వహించనున్నారు. ఇందుకోసం ధరావతు రూ 1లక్ష చెల్లించాలి. అలాగే 9న భక్తుల తలనీలాల కోసం వేలం పాట జరుగుతుంది. ఇందుకు వేలం పాట రుసుం రూ 25లక్షలు చెల్లించి బహిరంగ వేలంలో పాల్గొనాలని మేనేజర్‌ ఈశ్వరాచారి ఒక ప్రకటనలో తెలిపారు.

ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీకోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలకు ప్రతి ఏటా బీఎంఆర్‌జీఎఫ్‌ పౌండేషన్‌ తరఫున ఒంటిమిట్ట రామయ్యకు రెడ్ల రైతులు పండించిన పదార్థాలను సమర్పిస్తారు. ఇందులో భాగంగా శుక్రవారం బీఎంఆర్‌జీఎఫ్‌ పౌండేషన్‌ చైర్మన్‌ సుమతి రెడ్డి ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలు, రైతులు పండించిన తినుబాండారాలతో కూడిన సారెను ఒంటిమిట్ట రామయ్యకు సమర్పించారు. కార్యక్రమంలో సీబీఐటీ జై చంద్రారెడ్డి, కడపకు చెందిన వీరారెడ్డి, తిరుపతికి చెందిన యుగంధర్‌ రెడ్డి, దిలీప్‌ రెడ్డి, చిత్తూరుకు చెందిన శ్రీధర్‌ రెడ్డి పాల్గొన్నారు.

రాయచోటి: డిప్లమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (డిసెట్‌–2026), డిఎల్‌.ఈడీ కోర్సులో ప్రవేశాలకోసం ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రాయచోటి డైట్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె సుబ్రమణ్యం వెల్లడించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లా డుతూ ప్రభుత్వ డిస్ట్రిక్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌, ప్రైవేట్‌ ఎలిమెంటరీ టీచర్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూషన్‌లో అందిస్తున్న రెండు సంవత్సరాల కోర్సులో ప్రవేశానికి అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి నోటిఫికేషన్‌, అర్హత ప్రమాణాలు, ఆన్‌లైన్‌ దరఖాస్తు విధానంకు సంబంధించిన వివరాలు https://cse.ap.gov.in, https://apdeecet. apcfss.in వెబ్‌సైట్‌లో మార్చినెల 31 నుండి అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఏప్రిల్‌ 15వ తేది వరకు మ్యాన్యువల్‌ (ఆఫ్‌లైన్‌) దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రిన్సిపాల్‌ స్పష్టం చేశారు. పరీక్ష తేదీలు కూడా త్వరలో ప్రకటిస్తామన్నారు. ఇత వివరాలకు డైట్‌ ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ మడితాటి నరసింహారెడ్డిని నేరుగా లేదా 9440246825 నంబర్‌లో సంప్రదించవచ్చని తెలియజేశారు. అలాగే రాయచోటి డైట్‌లో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాన్ని కూడా అర్హులు వినియోగించుకోవచ్చని ప్రిన్సిపాల్‌ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement