ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి ఎక్కడ...
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి గురించి ఊసేలేదు. ఏడాదికి ఆడబిడ్డ నిధికి రూ.32,400 కోట్లు అవసరం కాగా దీని గూర్చి పూర్తిగా పట్టించుకోకపోవడం చంద్రబాబు చిత్తశుద్ధి లేమికి అద్దం పడుతోంది. అలాగే నిరుద్యోగ భృతి అంటూ ఓట్లు దండుకుని ఈ బడ్జెట్‌లో పూర్తిగా మొండి చేయి చూపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ల హామీకి పంగనామాలు పెట్టారు. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకి బడ్జెట్‌లో కేటాయించింది శూన్యం. రాష్ట్ర బడ్జెట్ మాటల గారడీ తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు.
– చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, పీలేరు


