సంజీవయ్య జీవితం ఆదర్శం
మదనపల్లె రూరల్: దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని సేవా దృక్పథాన్ని పెంచుకోవాలని జేసీ శివ్ నారాయణశర్మ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్లో దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పేదల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి దామోదరం సంజీవయ్య అన్నారు. బడుగు, బలహీనవర్గాలకు భూమి అందేలా ఎన్నో భూసంస్కరణలు చేపట్టారన్నారు. సమాజ హితం కోసం పోరాడిన ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు. జిల్లా విజిలెన్స్, పర్యవేక్షణ కమిటీ, ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడారు.డీఆర్వో మధుసూధన్‌రావు, కురబ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటరమణ, కుమ్మరి, శాలివాహన డైరెక్టర్ భావన, డీవీఎంసీ కమిటీ సభ్యులు శ్రీనివాసులు, చంద్రశేఖర్, మాలమహానాడు యమలా సుదర్శనం, ఎమ్మార్పీఎస్ నరేంద్ర పాల్గొన్నారు.
జేసీ శివ్ నారాయణ శర్మ


