హార్సిలీహిల్స్‌పైప్లాస్టిక్ వద్దంటూ ర్యాలీ
కొండపైకి స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థుల ట్రెక్కింగ్
బి.కొత్తకోట: జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ చెందిన 400 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు ఆదివారం మండలంలోని హార్సిలీహిల్స్‌పైకి ట్రెక్కింగ్ నిర్వహించారు. స్కౌట్స్ విద్యా విషయక క్యాలెండర్ ప్రకారం విద్యార్థులలో ధైర్య సాహసాలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించే చర్యల్లో భాగంగా పర్వతారోహణ, ట్రెక్కింగ్ నిర్వహించినట్లు జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా సెక్రెటరీ ఎం.నరసింహారెడ్డి తెలిపారు. ట్రెక్కింగ్‌తో కొండపైకి చేరుకున్న విద్యార్థులు పర్యావరణాన్ని కాపాడాలంటూ ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పించడానికి ర్యాలీ నిర్వహించారు. గాలిబండపై ప్లాస్టిక్ వ్యర్థాలను, గాజు ముక్కలను ఏరివేసి శుభ్రపరిచారు. కొండపైన స్కౌట్స్ ప్రాంతీయ శిక్షణ కేంద్రాన్ని సందర్శించి అక్కడ పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ కొండపై ఉన్న శిక్షణ కేంద్రం భవనాలు కూలిపోయే దశలో ఉన్నాయని, వీటిస్థానంలో కొత్త భవనాల నిర్మాణం అవసరం ఉందన్నారు. అనంతరం విద్యార్థులు సాంస్కతిక కార్యక్రమాలు, పిరమిడ్ విన్యాసాలు ఆకర్షించాయి. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో హెచ్‌డబ్ల్యూబి లక్ష్మీకర్, అసిస్టెంట్ సెక్రటరీ భాస్కర్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్, సిద్ధారెడ్డి, స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టెన్లు పాల్గొన్నారు.


