పీ..పీ..పీ.. డుం డుం డుం.. | - | Sakshi
Sakshi News home page

పీ..పీ..పీ.. డుం డుం డుం..

Feb 9 2026 7:34 AM | Updated on Feb 9 2026 7:34 AM

పీ..ప

పీ..పీ..పీ.. డుం డుం డుం..

పీ..పీ..పీ.. డుం డుం డుం.. ● కార్పొరేషన్‌ ఆస్తుల ధారాదత్తం తగదు

కడప సెవెన్‌రోడ్స్‌: కడప నగరపాలక సంస్థకు చెందిన వందల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులపై అధికార టీడీపీ నేతలు కన్నేశారు. ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించాల్సిన ఆస్తులను ఎంచక్కా కాజేసేందుకు చకచకా పావులు కదుపుతున్నారు. ఇందుకోసం పీపీపీ (పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌ షిప్‌) విధానాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఈ నెల 10 తేదీ జరగనున్న నగరపాలక సంస్ద సర్వసభ్య సమావేశ ఎజెండాలో కమిషనర్‌ దీనిని 13వ అంశంగా చేర్చారు. ఇది తీవ్ర దుమారం రేపుతోంది. వైఎస్‌ఆర్‌సీపీ సహా, వామపక్షాలు, దళిత, ఇతర ప్రజా సంఘాలు ప్రభుత్వ పీపీపీ ప్రతిపాదనపై భగ్గుమంటున్నాయి.

● కడప నగర నడిబొడ్డున ఉన్న అంబేద్కర్‌ భవన్‌, వైఎస్‌ఆర్‌ ఆడిటోరియం, నేక్‌నామ్‌ఖాన్‌ కళాక్షేత్రం, పాత మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలను కబళించేందుకు అధికార పార్టీ నేతలు బరి తెగించారు. ఇందుకు పీపీపీ ముసుగు తగిలించారు. కడప నగర పాలక సంస్థ అభివృద్ధి, మౌళిక వసతులు విస్తరణ, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలంటే కార్పొరేషన్‌కు సంబంధించిన కీలక ఆస్తులను పీపీపీ విధానంలోకి తీసుకురావాల్సి ఉంటుందని కలరింగ్‌ ఇస్తున్నారు. ఈ మేరకు టీడీపీ నేతలు ఈ ప్రతిపాదనను మున్సిపల్‌ కమిషనర్‌ ద్వారా ఎజెండాలో చేర్పించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. సంస్థ ఆస్తు లు పరాధీనం కాకుండా కాపాడుతూ వాటిని అభివృద్ధి చేసి ప్రజోపయోజానికి వినియోగించాల్సిన ప్రభుత్వ ఆస్తులను కాజేయాలని యత్నించడం దారుణమని పలువురు పచ్చ నేతల తీరును విమర్శిస్తున్నారు.

అది ప్రభుత్వ ఎజెండా

నగరపాలక సంస్థ ఆస్తులను పీపీపీ మోడ్‌లోకి తీసుకురావాలన్నది ప్రభుత్వ ఎజెండానే తప్ప మాదికాదు. మేం ఆ ఆంశాన్ని ఎజెండాలో చేర్చలేదు. రానున్న జనరల్‌ బాడీ సమావేశంలో ఆ ఆంశాన్ని తిరస్కరిస్తాం. నగరపాలక కమిషనర్‌ ప్రభు త్వం తరఫున ఆ ప్రతిపాదనను ఎజెండాలో పొందుపరిచారు. ప్రజలకు అవసరమైన దాన్నే వైఎస్‌ఆర్‌సీపీ పాలకవర్గం ఆమోదిస్తుంది. పీపీపీ విధానాన్ని తొలి నుంచి వైఎస్‌ఆర్‌సీపీ వ్యతిరేకిస్తోంది. –పాకా సురేష్‌ కుమార్‌,

మేయర్‌, కడప

కడప సెవెన్‌రోడ్స్‌: కడప నగరపాలక సంస్దకు చెందిన అంబేద్కర్‌ భవన్‌, వైఎస్‌ఆర్‌ ఆడిటోరియం, నేక్‌నామ్‌ఖాన్‌ కళాక్షేత్రం, పాత మున్సిపల్‌ కార్యాలయాలను పీపీపీ విధానం ద్వారా ప్రైవేట్‌ వ్యక్తులకు ధారాదత్తం చేస్తే సహించబోమని, దశల వారీగా ఆందోళనలు నిర్వహిస్తామని ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీ సంఘాలకు చెందిన నాయకులు సృష్టం చేశారు. హేతువాద సంఘం జిల్లా కార్యదర్శి సీఆర్‌వీ ప్రసాద్‌ అధ్యక్షతన ఆదివారం కడప నగరంలో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పలువురు మాట్లాడారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్త విధానంలో భాగంగానే పీపీపీ కింద ఇటీవల మెడికల్‌ కళాశాలలను ప్రైవేట్‌కు ఇస్తోందన్నారు. ఇప్పుడు కడప మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన ఆస్తులను కూడ అదే పద్ధతిలో ప్రైవేట్‌కు అప్పజెప్పే కుట్రపన్నడం దారుణమన్నారు. ిపీపీపీ కింద ఆస్తులను అప్పగించబోమంటూ మంగళవా రం జరగనున్న కార్పొరేషన్‌ సర్వసభ్య సమావేశంలో తీర్మానించాలని డిమాండ్‌ చేశారు. వివిధ సంఘాల నాయకులు కారు ఆంజనేయులు, వినోద్‌, బాషా, జేవీ రమణ, షిండే భాస్కర్‌, సీపీఐఎంఎల్‌ నాయకులు ఓబయ్య, డీఎం ఓబులేసు యాదవ్‌, లోక్‌సత్తా నాయకుడు దేవర శ్రీకృష్ణ, ఆప్‌ నాయకులు డాక్టర్‌ శ్రీనివాసులు మాట్లాడారు.

విలువైన ప్రభుత్వ భవనాలకుస్కెచ్‌ వేసిన పచ్చ నేతల్లో కల్యాణకల!

కడప కార్పొరేషన్‌ పరిధిలోనిపలు భవనాలపై టీడీపీ నేతల కన్ను

నగరపాలక సంస్థ సమావేశఎజెండాలో చేర్చిన కమిషనర్‌

పీ..పీ..పీ.. డుం డుం డుం..1
1/2

పీ..పీ..పీ.. డుం డుం డుం..

పీ..పీ..పీ.. డుం డుం డుం..2
2/2

పీ..పీ..పీ.. డుం డుం డుం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement