ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి మృతి

Feb 9 2026 7:34 AM | Updated on Feb 9 2026 7:34 AM

ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి మృతి

ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి మృతి

మదనపల్లె టౌన్‌ : అన్నమయ్య జిల్లాలోని బి.కొత్తకోటలో హంద్రీ–నీవా కాలువ గట్టుపై విషద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తి మదనపల్లెలో మృతి చెందాడు. ఆదివారం సీఐ గోపాల్‌రెడ్డి మీడియాకు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బి.కొత్తకోట సమీపంలోని ఓ ప్రయివేట్‌ కాలేజీ వద్ద ఉన్న హంద్రీ–నీవా కాలువ గట్టుపై సుమారు 60 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని వ్యక్తి శనివారం విషద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు బాధితుడిని పరిశీలించి, మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు సమాచారం అందించాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement