జగనన్నకు ఆశీస్సులందజేయాలని ప్రార్థించా
తంబళ్లపల్లె : మాజీ సీఎం జగనన్నకు చల్లని ఆశీస్సులు ఇవ్వాలని మల్లికార్జున స్వామిని ప్రార్థించినట్టు మాజీ మంత్రి జోగి రమేష్ అన్నారు. సోమవారం ములకలచెరువు నకిలీ మద్యం అక్రమ కేసులో ఆయన తంబళ్లపల్లె కోర్టుకు హాజరయ్యారు. కేసు వాయిదా వేయడంతో సమీపంలోని మల్లయ్య కొండపైకి వెళ్లారు. అక్కడ శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు, జగనన్నకు ఎల్లప్పుడూ చల్లని ఆశీస్సులు ఇవ్వాలని ప్రార్థించానని అన్నారు. గతంలో మల్లయ్య కొండకు భక్తులు రావాలంటే కాలినడక తో ఎంతో ఇబ్బంది ఉండేది, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి సహకారంతో జగనన్న పాలనలో ఘాట్ రోడ్డును నిర్మించినట్లు భక్తులు సంతోషంగా చెబుతున్నారన్నారు. దీనివల్ల శివరాత్రి రోజు లక్షల మంది భక్తులు మల్లయ్య సన్నిధికి వచ్చి దర్శించుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా జరిగిన మల్లయ్య కొండ అభివృద్ధి ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు.


