తల్లికి వందనం కూడా ఒక మోసమే | - | Sakshi
Sakshi News home page

తల్లికి వందనం కూడా ఒక మోసమే

Feb 17 2026 7:38 AM | Updated on Feb 17 2026 7:38 AM

తల్లి

తల్లికి వందనం కూడా ఒక మోసమే

తల్లికి వందనం కూడా ఒక మోసమే ఆడబిడ్డ నిధి పేరుతో మహిళలకు టోకరా

రాష్ట్రంలో 87,41,885 మంది పిల్లలు బడుల్లో చదువుతుంటే, రూ.15వేల వంతున ఏటా రూ.13,112 కోట్లు ఇవ్వాల్సి ఉండగా తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. 2025–26లో పిల్లల సంఖ్యను దాదాపు 21లక్షలు తగ్గించి, కేవలం 66 లక్షలమందికి రూ.8,389 కోట్లు ఇచ్చామన్నట్టుగా చూపిస్తున్నారు. ఇప్పటికీ క్షేత్రస్థాయిలో చాలామందికి అందలేదు. అందులోనూ చాలామందికి రూ. 8వేలు, 9వేలు, రూ.10వేలు మాత్రమే పడ్డాయి. మూడేళ్లలో ఇవ్వాల్సింది రూ.39,336 కోట్లు ఇవ్వాల్సి ఉంటే తక్కువ చూపిస్తున్నారు. తల్లికి వందనం పథకం అమలు కూడా ఒక మోసమే.

– పి. జయచంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి.వైఎస్సార్‌ కడప

ఆడబిడ్డ నిధి పథకానికి ఈ బడ్జెట్‌లో ఎలాంటి నిధులు కేటాయించలేదు. ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామని చెప్పారు. 18–50 ఏళ్లలోపు మహిళలకు ఏడాదికి రూ.32వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటే ఎగ్గొట్టారు. దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఇస్తామని ఒక్క సిలిండర్‌ మాత్రమే ఇచ్చారు. మూడు సిలిండర్లు ఎప్పుడిస్తారో చెప్పలేదు. వైఎస్సార్‌ ఆసరా పథకాన్ని పూర్తిగా ఎత్తేశారు. మహిళలకు సున్నావడ్డీ రుణాలు ఇవ్వడం లేదు.

– ఎంవీ సుజిత, స్వయం సహాయ సంఘ సభ్యురాలు.

తల్లికి వందనం కూడా ఒక మోసమే 
1
1/2

తల్లికి వందనం కూడా ఒక మోసమే

తల్లికి వందనం కూడా ఒక మోసమే 
2
2/2

తల్లికి వందనం కూడా ఒక మోసమే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement