టీడీపీ కూటమి ప్రభుత్వం ‘సంస్కారం’ మరిచింది. అంతిమ సంస్క
రాజంపేట : ప్రభుత్వ పెన్షనర్లు మృతి చెందితే వారి అంత్యక్రియలకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నగదు సాయం ఇప్పట్లో ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో వందలాది మంది ఈ డబ్బుకోసం ఎదురుచూస్తున్నారు. వారి కళ్లు కాయలు కాస్తున్నా ప్రభుత్వానికి కనికరం కరువైంది. గతంలో ప్రభుత్వ పెన్షనర్ చనిపోతే అదే రోజు అంత్యక్రియలకు డబ్బు ఇచ్చే విధానం కొనసాగింది. ఇప్పుడు ఆ పరిస్ధితి లేదు. మృతునికి సంబంధించిన పత్రాలు ఇచ్చేందుకు నెలకు పైగా పడుతుంది. ఇక ప్రభుత్వం నుంచి వీరికి ధనసాయం అందేందుకు ఎన్నాళ్లు పడుతుందో అర్థం కావడం లేదు. పెన్షనర్ చనిపోతే ఆయా కుటుంబీకులు అంత్యక్రియలు వెంటనే నిర్వహిస్తున్నా... సంప్రదాయం ప్రకారం ప్రభుత్వం నుంచి రావాల్సిన కనీస సాయం అందడం లేదు. ఇప్పటివరకు అనేక మంది ప్రభుత్వ పెన్షనర్ల కుటుంబీకులు నగదు కోసం వేచిఉన్నారు. జిల్లాలో రాజంపేట, కడప, ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు, సిద్ధవటం, పులివెందుల, ముద్దనూరు తదితర ప్రాంతాలో ఖజనా కార్యాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో అనేక మందికి అంత్యక్రియల డబ్బు రాలేదు.
నగదు జమలో జాప్యం...
ప్రభుత్వ పెన్షనర్లు మృతి చెందిన క్రమంలో వారికి చట్టబద్ధంగా రావాల్సిన అంత్యక్రియల నగదు వారి సంబంధీకులకు అందజేయడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోంది. ప్రభుత్వ పెన్షనర్ల కుటుంబాలను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని వాపోతున్నారు. ప్రభుత్వ పెన్షనర్ మరణించిన నేపథ్యంలో అందుకు సంబంధించి డెత్, ఫ్యామిలీ మెంబరు తదితర వివరాలను స్ధానిక ట్రెజరీలో అందచేస్తుంటారు. ఈ ట్రెజరీ ద్వారా ప్రభుత్వ ట్రెజరీకి వివరాలు వెళుతుంటాయి. అంతా అన్‌లైన్‌లో జరిగిపోతుంటాయి. అయితే ఖాతాలో నగదు జమ చేయడం ప్రభుత్వం మరిచిపోయినట్లుందన్న విమర్శలు ప్రభుత్వ పెన్షనర్ల కుటుంబీకుల్లో వినిపిస్తున్నాయి.
బడ్జెట్ లేదని కుంటిసాకులు
ప్రభుత్వ పెన్షనర్లు మరణిస్తే వారికి ఇవ్వాల్సిన ఫ్యునరల్ చార్జీస్ ఇచ్చేందుకు ప్రభుత్వం వెనుకంజ వేస్తోందన్న విమర్శలు వెలువడుతున్నాయి. కూటమి ప్రభుత్వం లక్షల కోట్లు వ్యయం చేసి, అనవసర కార్యక్రమాలను చేస్తున్న క్రమంలో ప్రభుత్వ పెన్షనర్లు మరణిస్తే వారి కుటుంబీకులకు డబ్బు ఇవ్వలేని దుస్ధితిలో ఉందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. బడ్జెట్ సాకుతో జిల్లాలో అనేక మంది మరణించిన ప్రభుత్వ పెన్షనర్ల కుటుంబాలకు ఫ్యునరల్ చార్జీలు చెల్లించడం లేదు. ప్రభుత్వ పెన్షనర్ల కుటుంబీకులు కూటమి ప్రభుత్వం తీరుపై అసంతృప్తితో ఉన్నారు.
ట్రెజరీల చుట్టూ మృతుల కుటుంబీకులు
దివంగతులైన ప్రభుత్వ పెన్షనర్లకు రావాల్సిన ఫ్యునరల్ చార్జీల కోసం వారి కుటుంబీకులు ట్రెజరీల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. ఫ్యునరల్ చార్జీలు చెల్లించేందుకు అవసరమైన పత్రాలు ఆన్‌లైన్‌లో రాష్ట్ర ఖజనాకు వె వెళ్లాయి. అయితే నెలల తరబడి ఈ చార్జీల కోసం ఎదురుచూడాల్సిన పరిస్ధితులు నెలకొన్నాయి. ట్రెజరీ అధికారులు తమ చేతిలో ఏమీ లేదని, డబ్బు రాష్ట్ర ఖజనా నుంచి రావాల్సిందేనని వాపోతున్నారు. ఫ్యునరల్ చార్జీల విషయంలో ఏమీ చేయలేమని స్థానిక ట్రెజరీ అధికారులు చేతులేత్తేస్తున్నారు. మృతుల కుటుంబీకుల ఖాతాలకు నేరుగా రాష్ట్ర ఖజానా నుంచి డబ్బు పడుతుందని చెబుతున్నారు. అయితే ఎప్పుడు వేస్తారో తెలియదంటున్నారు. దీంతో మృతిచెందిన ప్రభుత్వ పెన్షనర్ల కుటుంబీకులు మదనపడుతున్నారు. ఈ విషయంపై జిల్లా ట్రెజరీ అధికారి వివరణకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది.
అంత్యక్రియల నగదు జమలో
ప్రభుత్వ జాప్యం
దివంగత పెన్షనర్ల కుటుంబీకుల
ఎదురుచూపు
బడ్జెట్ లేదని కుంటి సాకులతో
కాలయాపన
చేతులెత్తేస్తున్న ఖజానా అధికారులు
ట్రెజరీల చుట్టూ తిరుగుతున్న కుటుంబీకులు
ప్రభుత్వం ‘మట్టి’కొట్టుకుపోతుందని శాపనార్థాలు
టీడీపీ కూటమి ప్రభుత్వం ‘సంస్కారం’ మరిచింది. అంతిమ సంస్క
టీడీపీ కూటమి ప్రభుత్వం ‘సంస్కారం’ మరిచింది. అంతిమ సంస్క


