ముగిసిన క్రికెట్ పోటీలు
కమలాపురం: మండలంలోని నల్లలింగాయపల్లెలో వెలసిన భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాంగణంలోని క్రికెట్ మైదానంలో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ అట్టహాసంగా ముగిసింది. ఫైనల్ పోరులో కడప వారియర్స్ జట్టు ట్రోఫీని అందుకుంది. గత మూడు రోజులుగా భారతి సిమెంట్స్ క్రీడా మైదానంలో ఆల్ ఓవర్ ఇండియాలోని వైకాట్‌కు చెందిన 7 టీములు నాకౌట్ మ్యాచ్‌లు ఆడాయి. చివరి రోజు సోమవారం కడప వారియర్స్, పులి ప్యాకర్స్ జట్లు ఫైనల్లో తల పడ్డాయి. ఇందులో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన పులి ప్యాకర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కడప వారియర్స్ 173 పరుగులు చేసి గెలుపొందింది.. కాగా తమ స్టేడియంలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ పండుగలా జరిగిందని ప్లాంట్ హెడ్ రామమూర్తి తెలిపారు. తమ సిబ్బంది ఇంటర్నేషనల్ స్థాయి క్రీడల్లాగా నిర్వహించారని అభినందించారు.


