కాశీవిశ్వేశ్వరున్ని దర్శించుకున్న మాజీ మంత్రి పెద్దిరెడ
పులిచెర్ల(కల్లూరు)– శివరాత్రి పర్వదినాన్ని పురష్కరించుకొని ఆదివారం మండలంలొని దేవళంపేటలో వెలసిన శ్రీకాశీవిశ్వేశ్వర స్వామి ఆలయం, చిచ్చిలివారిపల్లె లోని మల్లి కార్జున స్వామి ఆలయాల్లో జరిగిన పూజల్లో మాజీమంత్రి పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.అర్చకులు పెద్దిరెడ్డికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ సురేంద్రనాధరెడ్డి, మండల కన్వీనర్ నాధమునిరెడ్డి,వైఎస్సార్‌సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ హేమసుందరరెడ్డి, చెంచురెడ్డి, నిరంజన్‌రెడ్డి, గోవిందరెడ్డి, రాయల్‌మోహన్, లోకేశ్వరరెడ్డి , దేవేంద్రరెడ్డి పాల్గొన్నారు.


