జోగి రమేష్‌ కు వైఎస్సార్‌సీపీ నాయకుల సంఘీభావం | - | Sakshi
Sakshi News home page

జోగి రమేష్‌ కు వైఎస్సార్‌సీపీ నాయకుల సంఘీభావం

Feb 17 2026 7:38 AM | Updated on Feb 17 2026 7:38 AM

జోగి రమేష్‌ కు వైఎస్సార్‌సీపీ నాయకుల సంఘీభావం

జోగి రమేష్‌ కు వైఎస్సార్‌సీపీ నాయకుల సంఘీభావం

తంబళ్లపల్లె : ములకలచెరువు నకిలీ మద్యం తయారీ అక్రమ కేసులో తంబళ్లపల్లె కోర్టుకు హాజరైన మాజీ మంత్రి జోగి రమేష్‌ కు వైఎస్సార్‌సీపీ నాయకులు స్వాగతం పలికి, వెంట ఉండి సంఘీభావం తెలిపారు. ఆదివారం రాత్రి హార్సిలీహిల్స్‌పై విడిది చేసిన ఆయన సోమవారం తంబళ్లపల్లె కు చేరుకున్నారు. కురబలకోట మండలం మీదుగా ఇక్కడికి వచ్చారు. కోర్టుకు హాజరై కేసు వాయిదా పడిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌ రెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడ ఇద్దరు కొంతసేపు వివిధ అంశాలపై ముచ్చటించుకున్నారు. నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులకు జోగి రమేష్‌ను ఎమ్మెల్యే పరిచయం చేశారు. ఈ సందర్భంగా జగనన్న పాలనలో తంబళ్లపల్లె నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై జోగి రమేష్‌ ఎమ్మెల్యే వద్ద ప్రస్తావించి ప్రశంసించారు. వైస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆముదాల మధుసూదన్‌ రెడ్డి, మండల అధ్యక్షుడు చౌడేశ్వర, నాయకులు బెంగుళూరు మల్లికార్జున రెడ్డి, వేమారెడ్డి, శ్రీనివాసులు, మైనద్దీన్‌, భాస్కర్‌ రెడ్డి, ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి, రామమూర్తి, కె ఆర్‌.మల్లిరెడ్డి, కిషోర్‌ రెడ్డి, కృష్ణారెడ్డి, విష్ణువర్ధన్‌ రెడ్డికి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement