శివరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
కడప కోటిరెడ్డిసర్కిల్: మహా శివరాత్రి సందర్భంగా జిల్లాలోని శైవ క్షేత్రాలకు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పొలతలకు 165 బస్సులు, నిత్యపూజ కోనకు 40, లంకమల 23, బి.మఠం 17, మల్లెంకొండ 10, హత్యరాల 22, జ్యోతి 6, కన్యతీర్థం 8, అల్లాడుపల్లె దేవలాలు 12, తలకోన 5, మల్లెంకొండ 10, సంగమేశ్వర దేవలాలు 2, భానుకోట 3, అగస్తేశ్వరకోనకు 8 బస్సులు చొప్పున నడుపుతున్నామని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం బస్టాండ్లలో మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం, చలువపందిళ్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా పలువురు అధికారులను నియమించామని, భక్తులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


