పురుగు మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

పురుగు మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం

Feb 15 2026 7:23 AM | Updated on Feb 15 2026 7:23 AM

పురుగు మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం

పురుగు మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం

మదనపల్లె టౌన్‌ : పురుగు మందుతాగి రైతు ఆత్మహత్యకు యత్నించిన సంఘటన శనివారం జరిగింది. ఘటనపై మదనపల్లె జిల్లా ఆస్పత్రి ఔట్‌ పోస్టు పోలీసులు తెలిపిన వివరాలు.. చౌడేపల్లె మండలం, దావిడ కురప్పల్లికి చెందిన రైతు భాస్కర్‌ రెడ్డి(60) భూ వివాదం విషయమై స్థానికులతో జరిగిన గొడవలో మనస్థాపం చెందాడు. వెంటనే ఇంట్లోకి వెళ్లి టమాటా చెట్లకు కొట్టడానికి తెచ్చి ఉంచిన పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు బాధితున్ని వెంటనే ఓ ప్రైవేట్‌ వాహనంలో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్సల అనంతరం, అతని పరిస్థితి విషమించడంతో తిరుపతి రుయాకు రెఫర్‌ చేశారు. ఆస్పత్రి ఔట్‌ పోస్టు పోలీసులు రెతు ఆత్మహత్యాయత్నం సమాచారాన్ని చౌడేపల్లి పోలీసులకు అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement