చింతకాయల కోసం వెళ్లి.. | - | Sakshi
Sakshi News home page

చింతకాయల కోసం వెళ్లి..

Feb 12 2026 7:23 AM | Updated on Feb 12 2026 7:23 AM

చింతక

చింతకాయల కోసం వెళ్లి..

– చెట్టు పైనుంచి జారి పడి యువకుడు మృతి

వాల్మీకిపురం : చింతకాయల కోసం వెళ్లిన ఓ యువకుడు చెట్టుపై నుంచి జారి పడి మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకొంది. వివరాలు.. పట్టణంలోని ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన శివకుమార్‌ (32) చింతకాయల కోసం స్థానిక తరిగొండ రోడ్డులోని ఓ చెట్టు ఎక్కాడు. ప్రమాదవ శాత్తు చెట్టుపై నుంచి జారి కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమ నించిన స్థానికులు హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మహిళపై దాడిచేసిన వ్యక్తిఅరెస్ట్‌

చౌడేపల్లె : మహిళపై కొడవలితో దాడిచేసిన వ్యక్తిని అరెస్ట్‌చేసినట్లు ఎస్‌ఐ నాగేశ్వరరావు బుధవారం తెలిపారు. ఈనెల 3వతేదీ రాత్రి బోయకొండ సమీపంలోని యానాదిపాళ్యంకు చెందిన గంగలమ్మపై అదేగ్రామానికి చెందిన నాగరాజ కొడవలితో దాడిచేసి గాయపరిచాడు.ముఖం, తల, చేతిపై తీవ్రగాయాలయ్యాయి. ఆమెఫిర్యాధు మేరకు నాగరాజపై కేసు నమోదుచేశారు.కొలింపల్లె బస్సుస్టాప్‌ వద్ద ఉండగా అందిన సమాచారం మేరకు అరెస్ట్‌చేసి కోర్టుకు తరలించారు. న్యాయమూర్తి రిమాండుకు ఆదేశించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

టైలర్‌షాప్‌ దగ్ధం

– రూ.2 లక్షలు నష్టం

కలకడ : మండలంలోని నిడిమిచెర్లరో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో టైలర్‌షాపు దగ్ధమైంది. బాధితుడి కథనం మేరకు వివరాలు..కలకడ మండలం, నడిమిచెర్ల పంచాయతీ వడ్డిపల్లె గ్రామానికి చెందిన రెడ్డెప్ప జీవనోపాధికోసం నడించెర్లలో గది అద్దెకు తీసుకుని టైలర్‌షాపు నిర్వహిస్తున్నాడు. బుధవారం విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి.ఆ సమయంలో అతను దుకాణం లేదు. స్థానికులు గమనించి సమాచారం ఇవ్వడంతో అతను అక్కడికి చేరుకున్నాడు. అయితే అప్పటికే షాపులోని సామగ్రి కాలి బూడిదైంది. సుమారు రూ. 2లక్షల వరకు నష్టం జరిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరాడు. స్థానికులు మంటలు ఆర్పేశారు.

వెట్టిచాకిరి చేయిస్తున్నారని ఫిర్యాదు

మదనపల్లె టౌన్‌ : మదనపల్లె జిల్లా ఆస్పత్రి అత్యవసర విభాగంలో నలుగురు డాక్టర్లతోనే వెట్టి చాకిరి చేపిస్తున్నారని, క్యాజువాలిటీ విధులు నిర్వర్తించే డాక్టర్లు జిల్లా కల్టెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు క్యాజువాలిటి డాక్టర్లు సయ్యద్‌ హదీద్‌, లక్ష్మీకళ తదితరులు బుధవారం మదనపల్లె కలెక్టరేట్‌కు వెళ్లి జిల్లా కలెక్టర్‌ను కలసి, స్థానిక జిల్లా ఆస్పత్రిలోని డాక్టర్లపై ఫిర్యాదు చేశారు. గతంలో పది మంది డాక్టర్లు అత్యవర సేవలకు పనిచేసేవారని, తర్వాత నలుగురిని తగ్గించి.. ఆరుగురితో పనిచేయిస్తూ ఉండేవారని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుత మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రమేష్‌ ఆరుగురిలో మరో ఇద్దరిని తగ్గించి ప్రస్తుతం నలుగురితోనే పని చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు ఎముకల డాక్టర్లు క్యాజువాలిటీకి వచ్చే అత్యవసర కేసులను ఏడాది కాలంగా ఏనాడు చూడటం లేదని చెప్పారు. ఎములకల డాక్టర్లు ఉదయం 10 గంటలకు ఓపీకి వచ్చి మధ్యాహ్నం 12 గంటల తరువాత పత్తా ఉండరన్నారు. వాస్తవానికి వారిద్దరినే క్యాజువాలిటీకి వేయాలని కల్టెక్టర్‌ దృష్టికి సమస్యను తీసుకెళ్లినట్లు తెలిపారు.

చింతకాయల కోసం వెళ్లి.. 1
1/1

చింతకాయల కోసం వెళ్లి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement