భూ కబ్జాకు యత్నిస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

భూ కబ్జాకు యత్నిస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదు

Feb 17 2026 7:38 AM | Updated on Feb 17 2026 7:38 AM

భూ కబ

భూ కబ్జాకు యత్నిస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదు

మదనపల్లె టౌన్‌ : వారసత్వంగా సక్రమించిన ఆస్తిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని సోమవారం మదనపల్లెలో జిల్లా ఎస్పీకి బాధితుడు పిర్యాదుచేశాడు. మండలంలోని వేంపల్లెకు చెందిన బయగారి హేమచంద్రకు వారసత్వంగా సంక్రమించిన వ్యవసాయ భూమి కొంత ఉంది. ఆ భూమిపై కన్నేసిన అదే ఊరిలో ఉండే జయప్ప వర్గీయులు ఇతరుల దగ్గర కొనుగోలు చేశామన్న సాకుతో, ఆదివారం కబ్జాకు యత్నిస్తూ రాతి కూసాలను ట్రాక్టర్లలో తీసుకొచ్చి తన వ్యవసాయ పొలంలో అడ్డంగా తోలేశారని జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లికి ఇచ్చిన పిర్యాదులో పేర్కొన్నాడు. ఇదివరకే గొడవలు చేస్తుంటే తాము కోర్టును ఆశ్రయించగా.. ఇంజక్షన్‌ ఆర్డర్‌ కూడా కోర్టు ఇచ్చిందన్నారు. కోర్టు ఆర్డర్‌ను కూడా బేఖాతర్‌ చేస్తూ జయప్ప రాతి కూసాలను తన పొలంలో తోలి కబ్జాకు యత్నించడంతో ఎస్పీకి పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యా దు చేశామని పేర్కొన్నారు. పోలీసులు స్పంచింది. విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని కోరారు.

నా బిడ్డను చంపేశారని..

నా బిడ్డను చంపేశారనే అనుమానం ఉంది. విచారించి న్యాయం చేయాలని సోమవారం మదనపల్లె డిఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ నిర్వహించిన పీజిఆర్‌ఎస్‌లో బాధిత తల్లి ఫిర్యాదు చేసింది. వివరాలు.. మండలంలోని వలసపల్లె గ్రామం, అరవవాండ్లపల్లెకు చెందిన లక్ష్మినారాయణ, లక్ష్మీదేవి దంపతుల చిన్న కుమారుడు పూల దివాకర్‌(31) బెంగళూరులోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తుండేవాడు. ఈ ఏడాది జనవరి ఒకటి సందర్భంగా ఒక రోజు ముందే భార్య పిల్లలతో దివాకర్‌ అరవవాండ్లపల్లెలోని తన ఇంటికి వచ్చాడు. జనవరి 1న గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులతో వెళ్లాడని.. ఆ రోజు నుంచి దివాకర్‌ కనిపించడం లేదని బాధితురాలు పేర్కొంది. అప్పటినుంచి ఫోన్‌ పని చేయక పోవడంతో తన బిడ్డను చంపే శారేమో అన్న అనుమానం గా ఉందని దివాకర్‌ తల్లి ఆరోపించింది. ఇద్దరిపై అనుమానం ఉన్నట్లు పేర్కొని, తన బిడ్డ ఆచూకీ తెలపాలని లక్ష్మీదేవమ్మ స్థానిక తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయినా ఇప్పటి వరకు తమకు ఎలాంటి వివరాలు తాలూకా పోలీసులు వెల్లడించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అంగడిరూం ఆక్రమిస్తున్నాడని..

గుర్రంకొండ బస్టాండులో ఉండే తమ అంగడి రూమును సమీప బంధువు మాకం వెంకటేశ్వర్లు రాజకీయ నాయకుల పేరు చెప్పి ఆక్రమించేందుకు యత్నిస్తున్నాడని, సోమవారం జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లికి ఓ బాధితురాలు ఫిర్యాదు చేసింది. వివరాలు.. గుర్రంకొండలో నివాసం ఉంటున్న వై, వెంకటాచలపతి, పద్మ దంపతులు బస్టాండు దగ్గర గత కొన్నేళ్లుగా దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నేషనల్‌ హైవే అధికారులు రోడ్డు విస్తరణలో భాగంగా కూడా కొంత దుకాణం తొలగించి పరిహారం వెంకటాచలపతికి ఇచ్చారు. అలాంటి గదికి ఏఈ వద్ద కరెంట్‌బిలు, పంచాయతీ సెక్రటరీ దగ్గర పన్ను కట్టినట్లు నకిలీ పత్రాలు సృష్టించి మాకం వెంకటేశ్వర్లు టీడీపీ నాయకుడి పేరు చెప్పి బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. ఉన్నతాధికారు లు స్పందించి న్యాయం చేయాలని కోరింది.

భూ కబ్జాకు యత్నిస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదు1
1/2

భూ కబ్జాకు యత్నిస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదు

భూ కబ్జాకు యత్నిస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదు2
2/2

భూ కబ్జాకు యత్నిస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement