బాలికల వసతిగృహం తనిఖీ
పుంగనూరు: పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహాన్ని కలెక్టర్ నిశాంత్‌కుమార్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతిగృహంలో చదువుతున్న 9, 10 తరగతుల విద్యార్థినుల పుస్తకపఠనాన్ని, నేర్చుకున్న సామర్థ్యాన్ని ఆయన పరిశీలించారు. 6వ తరగతి చదువుతున్న విద్యార్థినిని గణితశాస్త్రంలోని సమస్యను పరిష్కరించాలని సూచించగా విద్యార్థిని సమస్యను పూర్తిగా పరిష్కరించడాన్ని పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ సైన్సు, గణితశాస్త్ర బోధనపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థినులకు కంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు అందిస్తున్న వసతి సౌకర్యాలు, ఆహార నాణ్యత, పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించి తగు ఆదేశాలు జారీ చేశారు.


