7 శాతం వడ్డీ...
రైతు తన వ్యవసాయ అవసరాల కోసం లక్ష రుపాయలు రుణం తీసుకుంటే సంవత్సరానికి 7 శాతం వడ్డీ అంటే రూ. 7 వేలు రూపాయలు వడ్డీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో కేంద్రం 3, రాష్ట్ర ప్రభుత్వం 4 శాతం వాటా ఉంటుంది. అంటే రైతు చెల్లించాల్సిన వడ్డీ మొత్తంలో కేంద్ర భరించాల్సిన 3 శాతం వడ్డీ అంటే 3 వేలు యథావిధిగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల ద్వారా స్థానిక సహకార సంఘాలకు చెల్లిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద చెల్లించాల్సిన 4 శాతం అంటే రూ.4 వేలు మాత్రం ఈ 18 నెలలగా ఇవ్వడం లేదు. ఉమ్మడి వైఎస్సార్‌జిల్లాలో 72 సహకారం సంఘాలతోపాటు డీసీసీబీ బ్రాంచిల ద్వారా రైతులు చాలా మంది వ్యవసాయ రుణాలు తీసుకున్నారు. వీరికి సంబంధించిన వడ్డీమాత్రం చెల్లించలేదు. వడ్డీ చెల్లించడం ఆలస్యమైతే వడ్డీకి వడ్డీ కూడా కలిసి బ్యాంకులు వసూలు చేస్తాయని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే సహకార సంఘాలు కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితులు ఏర్పడతాయి.
7 శాతం వడ్డీ...


