22న లేఖరచన పోటీలు | - | Sakshi
Sakshi News home page

22న లేఖరచన పోటీలు

Feb 12 2026 7:23 AM | Updated on Feb 12 2026 7:23 AM

22న ల

22న లేఖరచన పోటీలు

22న లేఖరచన పోటీలు బాధ్యతల స్వీకరణ త్రేతేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ 19 మంది సీనియర్‌ అసిస్టెంట్లకు వీఆర్వోలుగా రివర్షన్‌

మదనపల్లె అర్బన్‌: కడప డివిజన్‌ తపాలాశాఖ ఆధ్వర్యంలో ఈనెల 14న నిర్వహించ తలపెట్టిన లేఖారచనా పోటీని అనివార్య కారణాలతో ఈనెల 22వతేదీకి వాయిదా వేసినట్లు డీఈవో సుబ్రహ్మణ్యం చెప్పారు. బుధవారం ఆయన మాట్లాడుతూ తపాలాశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ–2026 లేఖారచనా పోటీని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనిపై విద్యార్థులకు అవగాహన కల్పించి పోటీకి సన్నద్ధం చేయాల్సిన బాధ్యత డీవైఈవోలు, ఎంఈవోలు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులపై ఉందన్నారు. అలాగే విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొని ప్రతిభ కనబరచాలన్నారు.

మదనపల్లె అర్బన్‌: జిల్లా ప్రొగ్రాం మేనేజ్‌మెంట్‌ ఆఫీసర్‌(డీపీఎంవో)గా సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రమేష్‌బాబు బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యసేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. ముఖ్యంగా సీజనల్‌ వ్యాధుల వ్యాప్తి, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వ పథకాల వినియోగం, లబ్ధి, వైద్యారోగ్యశాఖ కల్పిస్తున్న ప్రయోజనాలు, ఇతర అంశాలపై ఎప్పటికప్పుడు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు.

రాజంపేట టౌన్‌: పవిత్ర పుణ్య క్షేత్రంగా విరాజిల్లుతున్న హత్యరాలలోని త్రేతేశ్వర స్వామి బ్రహోత్సవాలు అంకురార్పణతో బుధవారం ప్రారంభమయ్యాయి. వేకువ జాము నుంచే స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇదిలావుంటే త్రేతేశ్వర స్వామి బ్రహోత్సవాలను మండలంలోని హత్యరాలతో పాటు పోలి, మందరం, సీతారాంపురం పంచాయితీల పరిధిలోని గ్రామాల ప్రజలు సంక్రాంతి పండుగ తరహాలో జరుపుకుంటారు. కాగా శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని హత్యరాల గ్రామంలో వివిధ జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో గ్రామంలో కోలాహల వాతావరణం నెలకొంది.

మదనపల్లె రూరల్‌: రెవెన్యూ శాఖలో తాత్కాలిక షరతులతో సీనియర్‌ అసిస్టెంట్లుగా పదో న్నతి పొంది, శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించకపోవడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 19 మందిని తిరిగి గ్రేడ్‌–1 వీఆర్వోలుగా రివర్షన్‌ చేస్తూ కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఉత్తర్వులు ఇచ్చారు. బుధవారం చిత్తూ రు జిల్లా కలెక్టరేట్‌ విడుదల చేసిన ఉత్తర్వుల్లో..ఉమ్మడి చిత్తూరుజిల్లాలో 48 మంది గ్రేడ్‌–1 వీఆర్వోలను జీఓ.ఎం.ఎస్‌.నెం.154, రెవెన్యూ సర్వీసెస్‌ తేదీ.05.7.2021 ప్రకారం తాత్కాలిక షరతులతో సీనియర్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించారు. అందులో భాగంగా పదోన్నతి పొందిన గ్రేడ్‌–1 వీఆర్వోలు రెండేళ్లు.. కలెక్టరేట్‌, ఆర్డీ, మండల తహసీల్దార్‌ కార్యాలయాల్లో సీనియర్‌ అసిస్టెంట్లుగా పనిచేయాలి. రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌గా క్షేత్రస్థాయి విధులు నిర్వహించకూడదు. శాఖా పరంగా నిర్వహించే రెవెన్యూ పరీక్షలు–1,2,3, 42 రోజుల సర్వే శిక్షణ, పంట నమూనా, అకౌంట్స్‌ టెస్ట్‌ ఫార్‌ సబార్డినేట్‌ ఆఫీసర్స్‌ పార్ట్‌–1 ఉత్తీర్ణత సాధించాలి. ఏపీపీఎస్సీ నిర్వహించే కంప్యూటర్‌, అనుబంధ సాఫ్ట్‌వేర్‌ వినియోగంలో ప్రావీణ్యం పరీక్ష పాస్‌ అవ్వాల్సి ఉంది. ఈ మూడు షరతులు పూర్తిచేసిన తర్వాత సీనియర్‌ అసిస్టెంట్‌ హోదాలో రెగ్యు లర్‌ నియామకం పొందుతారు. పదోన్నతి పొందిన 48 మంది సీనియర్‌ అసిస్టెంట్లలో షరతులు పూర్తిచేయని 19 మందిని తిరిగి పూర్వ హోదా అయిన వీఆర్వో (గ్రేడ్‌–1)కు రివర్షన్‌ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. రివర్షన్‌ పొందిన గ్రేడ్‌–1 వీఆర్వోలు తదుపరి పోస్టింగ్‌ల కోసం చిత్తూరు జిల్లా కలెక్టర్‌ లేదా నోడల్‌ అధికారి ఎదుట హాజరుకావాలని ఆదేశించారు.

22న లేఖరచన పోటీలు 1
1/1

22న లేఖరచన పోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement