● సాగునీటిపై ఆశలు
మెడి‘కిల్’చేయొద్దు
మదనపల్లె: మదనపల్లెను జిల్లా కేంద్రం చేశాక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్‌లో అభివృద్ధికి ప్రాధాన్యత దక్కుతుందా లేదా అని జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హఠాత్తుగా జిల్లా కేంద్రం మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. కొత్త జిల్లా కేంద్రం మదనపల్లైపె ఏ మేరకు ప్రభుత్వం చిత్తశుద్ధి చూపుతుందో బడ్జెట్ కేటాయింపుల్లో తేలనుంది. ప్రధానంగా నిధుల సాధనకు జిల్లా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యేలు నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, షాజహాన్‌బాషాలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సి ఉంది. తమ నియోజకవర్గాల అభివృద్ధికి, తంబళ్లపల్లె, పుంగనూరుల్లో ఆగిపోయిన పరిశ్రమలు, ప్రాజెక్టులను పూర్తి చేయించే బాధ్యత వీరిపైనే ఉంది. అధికార పార్టీనేతలు జిల్లా ప్రగతికి కృషి చేయాలని, నిరక్ష్యం చేస్తే అభివృద్ధిలో తిరోగమనం తప్పదని ప్రజలు అంటున్నారు.
ప్రాధాన్యం ఇవ్వాల్సినవి
● వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బీటీ కళాశాలను విశ్వవిద్యాలయం చేస్తూ జీవో జారీ చేసింది. దీన్ని అమలుచేసి విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దాలి.
● మదనపల్లె టమాట మార్కెట్‌ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. ఇంతవరకు దాని ఊసేలేదు. టమాట ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తామని హామీ అమలు కాలేదు.
● మదనపల్లె పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను తీసుకొస్తామని లోకేష్ హామీ అమలు కాలేదు.
● జిల్లాలో ఏకై క పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌ను టీడీపీ పాలనలో 2000లో టౌన్‌షిఫ్ చేశారే కాని పైసా నిధులు ఇవ్వలేదు. కమిటీకి సొంత ఆదాయ వనరులున్నా సమస్యలను పట్టించుకోవడం లేదు. కొండపై హెలిప్యాడ్, రోప్‌వే ప్రతిపాదన సాధ్యం కాదని తేలింది. మరోసారి దీనిపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది.
● కూటమి పాలన రాకతో తంబళ్లపల్లెలో ఆగిపోయిన వందల కోట్ల విలువైన రహదారుల పనులను చేపట్టాలి.
● వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో బురకాయలకోట, కడపక్రాస్, కలిచర్లకు ప్రాథమిక వైద్యకేంద్రాలు మంజూరు చేయగా వాటిని ఆపేశారు. వీటిని ప్రారంభించాలి.
● బెంగళూరు–చైన్నె ఎక్స్‌ప్రెస్ హైవేనుంచి పుంగనూరు మీదుగా రొంపిచర్ల క్రాస్ వరకు హైవేరోడ్డు అనుసంధాన పనులు మంజూరై గత ప్రభుత్వంలో మొదలయ్యాయి. కూటమిపాలన రాకతో వీటిని రద్దు చేశారు. ఈ పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
● పుంగనూరులో జర్మన్ పెప్పర్‌మోషన్ ఎలక్ట్రికల్ బస్సులు, ట్రక్కులు తయారీ పరిశ్రమను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టగా కూటమిపాలనలో ఆగిపోయింది. ఈ పరిశ్రమను చేపట్టి పూర్తి చేయాలి.
● పుంగనూరులో స్టేడియం ఏర్పాటుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అనుమతి వచ్చే సమయంలో ప్రభుత్వం మారడంతో ఆగిపోయింది.
● పుంగనూరులో మైనార్టీ జూనియర్ కళాశాల మంజూరు, ఏర్పాటుకు భూ కేటాయింపును వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసింది. దీన్ని ప్రారంభించాలని మైనార్టీలు కోరుతున్నారు.
● వెలిగల్లు నుంచి రాయచోటికి తాగునీటిని తరలించేందుకు రూ.100 కోట్లతో గత ప్రభుత్వంలో చేపట్టిన పనులు 60శాతం పూర్తయిన ప్రభుత్వం పూర్తి చేయించలేదు. వీటిని పూర్తి చేయించాల్సివుంది.
● గత ప్రభుత్వంలో రాయచోటిలో చేపట్టిన క్రికెట్ స్టేడియం పనులు పూర్తి చేయించాలి.
● రాయచోటిలో ఆగిపోయిన అండర్‌గ్రౌడ్ డ్రైనేజి పనులు చేపట్టి పూర్తి చేయాలి.
● రాయచోటిలో విద్యా సంస్థల కోసం కేటాయించిన భూమిలో విద్యాసంస్థలను నెలకోల్పి, శిల్పారామం పనులు పూర్తి చేయించాలి.
మదనపల్లెలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మంజూరు చేసి చేపట్టిన మెడికల్ కళాశాలను కిల్ చేయుద్దంటూ ప్రజలు వేడుకుంటున్నారు. పేదలకు కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా అందే వైద్యానికి సమాధి చేయొద్దంటూ వేడుకుంటున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్.జగన్ 95 ఎకరాల భూమిని కేటాయించి, అందులో భవన నిర్మాణాలకు రూ.475 కోట్లలో రూ.80 కోట్ల పని పూర్తయ్యింది. మిగిలిన పనులు పూర్తి చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కళాశాలను నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, పుంగనూరు నియోజకవర్గాలకు ఈ మెడికల్ కళాశాల ఎంతో ప్రయోజనకరం.
హంద్రీ–నీవా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధి చూపాలి. పనులు పూర్తి చేయించేందుకు రూ.2,500 కోట్లు కావాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇందులో జిల్లాలో రూ.925 కోట్ల పనులకు ప్రతిపాదించారు. ఈ నిధులను కేటాయిస్తే పనులు పూర్తి చేసేందుకు అవకాశం దక్కుతుంది లేదంటే నిధుల కొరతతో పనులు పడకేస్తాయి. ఇప్పటిదాకా పుంగనూరు ఉపకాలువకు మాత్రమే నీటిని అందించారు. ఇంకా ప్రధాన కాలువ, నీవా, తంబళ్లపల్లె ఉపకాలువలు, చింతపర్తి, వాయల్పాడు డి స్ట్రిబ్యూటరీలకు, వీటి పరిధిలోని శ్రీనివాసపురం, అడివిపల్లి రిజర్వాయర్లకు చుక్కనీరు అందలేదు. గాలేరు–నగరి, హంద్రీ–నీవా ప్రాజెక్టుల అనుసంధాన పనులను నిలిపివేసిన ప్రభుత్వం దీన్ని చేపట్టి పూర్తి చేయాలని కరువు ప్రాంత రైతాంగం కోరుతోంది.
సాగునీటి ప్రాజెక్టులకు నిధులపై ఆశలు
చంద్రబాబు, లోకేష్ హామీలు నెరవేరుస్తారా..
పుంగనూరులోఎలక్ట్రికల్ బస్సులపరిశ్రమను చేపట్టాలి
బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారా..ఎగనామం పెడతారా?
ప్రభుత్వం హడావుడిగా మదనపల్లె పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించి చేతులు దులుపుకుంది. రాయచోటిలోని ప్రభుత్వ జిల్లా కార్యాలయాలను ఇక్కడికి తరలించి కేంద్రంగా మార్చింది. అయితే ఒకరోజు ముందు జిల్లా కేంద్రం అమలులోకి వస్తున్నట్టు ప్రభుత్వం డిసెంబర్ 30న జీవో జారీచేసి, 31 నుంచి పాలన ప్రారంభించింది. అప్పటి సబ్‌కలెక్టర్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంగా మార్పుచేయగా పాలన ప్రారంభమైంది. ఇక్కడి సబ్‌కలెక్టర్ కార్యాలయాన్ని డీడీఓ భవనంలోకి తరలించగా జిల్లా కార్యాలయాలకు భవనాలు, వసతులు లేవు. అధికారులు కార్యాలయాల్లో కుదు రుగా కూర్చునే పరిస్థితిలేదు. బీటీ కళాశాల, బీటీ ట్రస్ట్‌కు చెందిన భవనాలను స్వాఽధీనం చేసుకుని అందులోని గదులపై ఫలానా జిల్లా కార్యాలయం అంటూ కాగితాలు అంటించారు, అక్కడ కార్యాలయాలు లేవు. జిల్లా కేంద్రం స్థాయికి తగినట్టుగా అభివృద్ది ప్రణాళిక మాటేలేదు.
● సాగునీటిపై ఆశలు
● సాగునీటిపై ఆశలు
● సాగునీటిపై ఆశలు


