ఈ–చలానా లింకులతో జాగ్రత్త
మదనపల్లె టౌన్ : ఈ చలానా చెల్లింపుల విషయంలో వాహదారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పి ధీరజ్ కునుబిల్లి హెచ్చరించారు. శనివారం మదనపల్లె కలెక్టరేట్ లో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. సైబర్ నేరాగాళ్లు పోలీసుల పేరుతో నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి నకిలీ పేమెంట్ల లింకులతో ప్రజల సెల్ ఫోన్లకు లింకులు పంపి డబ్బు ఖాజేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఏపి పోలీస్ శాఖ అప్రమత్తమై ప్రజలను సైబర్ నేరగాళ్ల నుండి మోసపోకుండా అప్రమత్తం చేస్తున్నట్లు తెలలిపారు. ఎప్పుడూ పేమెంట్ లింకులు పంపదని గుర్తుచేశారు. ఈ– చలానాలను తనిఖీ లేదా చెల్లించడానికి కేవలం ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ ను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. అంతే కాకుండా వాట్సాప్ ఈ– గవర్నెన్స్ సేవ, ఫోన్ నంబర్ 9552300009 ద్వారా ఫోన్ పే, గూగుల్ పే, ఏపిఆన్‌లైన్, మీ–సేవా, గ్రామ, వార్డుడ సచిఇవాలయాలలో మాత్రమే చెల్లించాలని తెలిపారు. జిల్లాలోని పోలీస్ అధికారులు సైబర్ మోసాలపై ప్రజల్లో విసృతంగా అఅవగాహన కల్పిచాలని జిల్లా ఎస్పీ సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు.
జిల్లా ఎస్పీ ఽధీరజ్ కునుబిల్లి


