అయ్యో పాపం.. | - | Sakshi
Sakshi News home page

అయ్యో పాపం..

Feb 11 2026 7:32 AM | Updated on Feb 11 2026 7:32 AM

అయ్యో

అయ్యో పాపం..

గుండెపోటుతో తండ్రి మృతి

అనాథలైన ముగ్గురు పిల్లలు

పులివెందుల రూరల్‌ : పులివెందుల పట్టణంలోని కడప రోడ్డు సమీపంలోని హెచ్‌పీ గ్యాస్‌ గోడౌన్‌ వద్ద మోపూరి రాజా అనే వ్యక్తి డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మంగళవారం ఉదయం రాజా ఛాతి నొప్పితో బాధపడుతూ గుండె పోటుతో మృతి చెందారని బంధువులు తెలిపారు. మృతుడు రాజా భార్య ఆరేళ్ల క్రితం కరోనాతో మృతి చెందింది. రాజాకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉండగా, ప్రస్తుతం వారు అనాథలయ్యారు. దీంతో పిల్లలు అనాథలు కావడంతో అయ్యో పాపమంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గంగమ్మ దేవత హుండీ

ఆదాయం రూ. 5,28,846

లక్కిరెడ్డిపల్లి : మండలంలోని అనంతపురం గ్రామంలో వెలసిన శ్రీశ్రీ అనంతపురం గంగమ్మ దేవత హుండీ ఆదాయాన్ని మంగళవారం కడప దేవాదాయశాఖ తనిఖీ అధికారి శివయ్య ఆధ్వర్యంలో లెక్కించినట్లు ప్రత్యేకాధికారి శ్రీనివాసులు, ఆలయ చైర్మన్‌ సోడి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. జూన్‌ 2025 నుండి ఫిబ్రవరి 2026 వరకు ఆలయంలో పర్మినెంటుగా ఉన్న హుండీల ఆదాయం లెక్కింపు చేయగా రూ. 5, 28, 846లు వచ్చినట్లు వారు తెలిపారు. ఈ నగదు మొత్తం ఆలయ ఖాతాకు జమ చేసి ఆలయ అభివృద్ధికి ఉపయోగించనున్నట్లు ఆలయ ప్రత్యేక అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు ఆదిమూలం చంద్ర, గంగయ్య, రెడ్డిశేఖర్‌, బోస్‌ యాదవ్‌, పోలీసులు, ఆలయ కమిటీ నిర్వహకులు, భక్తులు పాల్గొన్నారు.

మిట్స్‌కు జాతీయ స్థాయిలో 11వ ర్యాంకు

కురబలకోట : మద్రాస్‌ ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ఎన్‌పీటీఈఎల్‌ సంయుక్తంగా నిర్వ హించిన స్వయం ఆన్‌లైన్‌ పరీక్షలలో అంగళ్లులోని మిట్స్‌ డీమ్డ్‌ యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు 7155 మంది ప్రతిభ కనపరిచారని కళాశాల ప్రిన్సిపాల్‌ రామనాథన్‌ తెలిపారు.142 మంది గోల్డ్‌ రేటింగ్‌, 1419 మందికి సిల్వర్‌, 3623 మందికి ఎల్తేట్‌, 312 మంది టాపర్లుగా నిలిచారని తెలిపారు. దీంతో కళాశాలకు త్రిబుల్‌ ఏ రేటింగ్‌తో పాటు టాప్‌ 20లో మిట్స్‌ కళాశాలకు 11వ ర్యాంకు గుర్తింపు లభించినట్లు తెలిపారు. చైన్నెలో జరిగిన కార్యక్రమంలో షీల్డ్‌తో పాటు ప్రశంస పత్రాన్ని అందుకున్నటు్‌ల్‌ తెలిపారు.

అయ్యో పాపం.. 1
1/1

అయ్యో పాపం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement