కడప–బెంగుళూరు రైల్వే పనులకు కేంద్రమే నిధులు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

కడప–బెంగుళూరు రైల్వే పనులకు కేంద్రమే నిధులు ఇవ్వాలి

Feb 11 2026 7:32 AM | Updated on Feb 11 2026 7:32 AM

కడప–బ

కడప–బెంగుళూరు రైల్వే పనులకు కేంద్రమే నిధులు ఇవ్వాలి

గువ్వలచెరువు సొరంగం నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌

గువ్వలచెరువు సొరంగం నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌

కడప సెవెన్‌రోడ్స్‌: కడప–బెంగుళూరు రైల్వే మార్గం పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వమే వంద శాతం నిధులను ఇవ్వాలని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి కోరారు. మంగళవారం ఆయన ఈ అంశంపై లోక్‌సభలో మాట్లాడుతూ 2010లో ఈ రైల్వేలైన్‌ పనులను రూ. 2700 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారని తెలిపారు. నేటికీ 10 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయన్నారు. ఈ ప్రాజెక్టు పరిపూర్తికి కేంద్రం 50 శాతం, రాష్ట్రం 50 శాతం నిధులు కేటాయించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తన వాటాగా ఇవ్వాల్సిన 50 శాతం నిధులను కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్రం ఉందని తెలిపారు. కేంద్రమే వంద శాతం నిధులను విడుదల చేసి రైల్వే లైన్‌ పనులు వేగవంతంగా పూర్తి చేయా లని కోరారు. ఏపీ విభజన చట్టం 2014 లో హామీ ఇచ్చిన విధంగా కడపలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. పలుమార్లు ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి వచ్చినట్లు ఆయన వివరించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం సీమ ప్రాజెక్టులకు ప్రాణప్రదమైందన్నారు. కేంద్ర బృందం రీ విజిట్‌ నిర్వహించి ఈ పథకానికి అవసరమైన పర్యావరణ అనుమతులు మంజూరు చేయా లని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎన్విరాన్‌మెంటల్‌ క్లియరెన్స్‌ రాలేదని చెప్పారు.

కడప కార్పొరేషన్‌: కడప– రాయచోటి రహదారిలో గువ్వల చెరువు ఘాట్‌ వద్ద సొరంగం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి 2025 డిసెంబర్‌ 17న రాసిన లేఖకు కేంద్ర రోడ్డు, రవాణా, హైవేస్‌ మంత్రి నితిన్‌ గడ్కరీ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. కడప– రాయచోటి మార్గంలో 4లేన్ల రహదారి, దాని అనుబంధ మార్గాల నిర్మాణానికి సంబంధించి పీఎంసీ సేవలు, డీపీఆర్‌ తయారీ, నిర్మాణానికి ముందు పనులు, నిర్మాణం, నిర్వహణ పర్యవేక్షణ కోసం రూ.10.95కోట్లు మంజూరు చేశామని మంత్రి పేర్కొన్నారు. సొరంగం నిర్మాణ పనులు 2025–26, 2026–27 వార్షిక ప్రణాళికలో చేర్చామని అందులో వివరించారు. దీని అలైన్‌మెంట్‌కు సంబంధించి మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందన్నారు.

తిరుపతి నుంచి అంతర్జాతీయ

విమాన సర్వీసులు నడపాలి

రాజంపేట: తిరుపతి విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమానసర్వీసులు నడపాలని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి కోరారు. ఈ అంశంపై పార్లమెంటులో మంగళవారం డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కడప, అన్నమయ్య, నెల్లూరు. చిత్తూరు జిల్లాలకు చెందిన ప్రజల అత్యధిక సంఖ్యలో గల్ఫ్‌, యూరప్‌ , పాశ్చాత్య దేశాలకు ఉపాధి పొందుతున్నారన్నారు. తిరు పతి విమానాశ్రయం నుంచి గల్ఫ్‌, యూరప్‌, అమెరికా దేశాలకు నేరుగా అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభించాలని కేంద్రాన్ని కోరారు.

‘సీమ’ఎత్తిపోతలకు అనుమతులు ఇవ్వాలి

కడప స్టీల్‌ ప్లాంటు నిర్మించాలి

కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి లేఖకి

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సమాధానం

కడప–బెంగుళూరు రైల్వే పనులకు కేంద్రమే నిధులు ఇవ్వాలి 1
1/1

కడప–బెంగుళూరు రైల్వే పనులకు కేంద్రమే నిధులు ఇవ్వాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement