లోకానికి వెలుగు చుక్క లూర్దుమాత
కడప సెవెన్‌రోడ్స్: లోకానికి వెలుగు చుక్క పరిశుద్ధ లూర్దుమాత అని వికార్ జనరల్ ఫాదర్ ఎండీ ప్రసాద్‌రావు అన్నారు. లూర్దుమాత తిరునాల మహోత్సవాల్లో భాగంగా మంగళవారం స్థానిక డాన్ బోస్కో ఐటీఐలో ఉన్న అంతోని చర్చిలో ఫాదర్ ప్రసాద్ రావు దివ్యబలి పూజ సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ భక్తులందరికీ మేరిమాత మార్గదర్శకంగా ఉందన్నారు. పూర్వం నౌకా యాత్రికులకు మరియమాత సముద్రపు నక్షత్రంలా దారి చూపేదని చెప్పారు. అందుకే ఆమెకు సముద్రపు నక్షత్రమని పేరు కూడా ఉందని చెప్పారు. అనంతరం ఆ పూజలో డయాసిస్ ప్రొక్యురేటర్ ఫాదర్ ఎస్.సురేష్ ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. అనంతరం సంధ్య సర్కిల్ వద్ద ఉన్న అంతోని వారి చర్చీ నుంచి భక్తిశ్రద్ధలతో మరియమాత ను నగరంలోని ప్రధాన కూడళ్లు గుండా మరియాపురం పాత చర్చి ఆవరణం వరకు భారీగా ఊరేగిం పు చేశారు.అనంతరం దువ్వూరు విచారణ గురువు సల్లా మనోహర్ ఆధ్వర్యంలో అక్కడున్న ఫాదర్ క్రంబ్లిష్ వేదిక పై యువకులు, పిల్లల చేత నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విచారణ గురువు ఈరి లూర్ధు మరియన్న, సహాయ గురువు జంపంగి సుధాకర్,ఫాద ర్ సిప్రియన్,, ఫాదర్ జార్జ్ ,తిరుణాల కమిటీ అధ్యక్షుడు గుంతమళ్ళ బాలయ్య, ప్రధాన కార్యదర్శి వారాది జోసఫ్ ,ఉపాధ్యక్షుడు పి.లూర్ధు ,ట్రెజరర్ నంది మండలం విజయరాజు, పుల్ల గుజ్జు శేఖర్‌లతోపాటు మహిళలు, యువ కులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
లోకానికి వెలుగు చుక్క లూర్దుమాత


