ప్రభుత్వ భూమి ఆక్రమణ.. ముగ్గురికి మెమోలు
రొంపిచెర్ల: అనంతపురం– చైన్నై జాతీయ రహదారిలోని రొంపిచెర్ల మండలం బండకిందపల్లె గ్రామ పంచాయతీలో రూ.3 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైంది. దీనిపై కమోళ్లపల్లె, మట్లోళ్లపల్లె గ్రామస్థులు కలెక్టర్ సుమిత్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. జాతీయ రహదారి పక్కన భూముల ధరలు కోట్లలో పలుకుతున్నాయి. రెవిన్యూ అధికారులు సకాలంలో స్పందించక పోవడంతో అక్రమణ దారులు రెండు మూడు రోజు లుగా సర్వే నెంబరు 36లో సుమారు రూ.75 సెంట్ల భూమిని జేసీబీతో చదును చేసి చుట్టూ ముళ్ల కంచె ఏర్పాటు చేసి మామిడి మొక్కలు కూడా నాటేశారు. 20 రోజుల క్రితం అదే భూమిలో ఎర్రబాబన్న చెరువుకు పోతున్న సప్లయ్ చానల్‌ను పూడ్చి వేసి క్రితం మామిడి మొక్కలు నాటారని, చెరువుకు నీరు రావడం లేదని కలెక్టర్‌కు రైతులు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ ఆక్రమణదారుడిపై చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను అదేశించారు. దీంతో ఇరిగేషన్ ఏఈ మునిశేఖర్ సదరు సప్లయ్ చానల్‌ను పరిశీలించగా.. ఆ చానల్ ఆనవాళ్లే కనిపించలేదు. సదరు సప్లెయ్ చానల్‌ను గుర్తించాలని వారు రెవెన్యూ అధికారులను కోరారు
లూర్దుమాత ఊరేగింపు ర్యాలీలో విశ్వాసులు
భక్తిశ్రద్ధలతో వేడుక


