ముగిసిన ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు

Feb 11 2026 7:32 AM | Updated on Feb 11 2026 7:32 AM

ముగిస

ముగిసిన ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు

ముగిసిన ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు 12న ‘కిసాన్‌ మేళా రైల్వేలో యూటీఎస్‌ సేవలు నిలిపివేత జిల్లాకు యూరియా రాక ‘మిస్‌ గ్రాండ్‌’ రన్నరప్‌గా మహిమాన్విత హుండీ ఆదాయం లెక్కింపు

కడప ఎడ్యుకేషన్‌: జిల్లావ్యాప్తంగా ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమైన ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు 10వ తేదీతో ముగిశాయి. చివరిరోజు మంగళవారం 36 పరీక్షా కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు 796 మంది విద్యార్థులు హాజయ్యారు ఆర్‌ఐవో వెంకటేశ్వర్లతోపాటు స్క్వాడ్‌్‌ బృందాలు, డీఈసీ సభ్యులు జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి సిబ్బందికి తగిన సూచనలు, సలహాలను ఇచ్చినట్లు తెలిపారు.

కడప అగ్రికల్చర్‌: ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో దక్షిణ మండల స్థాయి ( కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల స్థాయిలో) భారీ ‘‘ కిసాన్‌ మేళా ’ ఫిబ్రవరి 12న తిరుపతిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్ర 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వి. సుమతి కేవీకే సమన్వయకర్త అంకయ్యకుమార్‌లు తెలిపారు. ‘సమగ్ర వ్యవసాయం – లాభదాయకం‘ అనే నినాదంతో జరిగే ఈ మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

కడప కోటిరెడ్డిసర్కిల్‌: ఇప్పటివరకు యూటీఎస్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా ప్లాట్‌ఫాం, జనరల్‌ టిక్కెట్టు కొనేవారని, మార్చి 1 నుంచి వాటిని నిలిపి వేస్తున్నామని కడప రైల్వే కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌ జనార్దన్‌ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యూటీఎస్‌ స్థానంలో రైల్‌ వన్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. మార్చి 1వ తేది నుంచి ఈ యాప్‌ ద్వారా ప్లాట్‌ఫాం, జనరల్‌టిక్కెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గుర్తిస్తూ ఆయా టిక్కెట్లను యాప్‌ ద్వారా తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు.

కడప అగ్రికల్చర్‌: జిల్లాలో ఎక్కడా ఎరువుల కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి బుక్కే చంద్రానాయక్‌ తెలిపారు. మంగళవారం జిల్లాకు 1710 మెట్రిక్‌ టన్నుల యూరియా వచ్చిందని ఆయన తెలిపారు. ఇందులో 1150 మెట్రిక్‌ టన్నుల యూరియాను మార్క్‌ఫెడ్‌కు కేటాయించగా మరో 560 మెట్రిక్‌ టన్నులను ప్రైవేటు డీలర్లకు కేటాయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎరువుల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

కడప అర్బన్‌: మిస్‌ గ్రాండ్‌ – ఏపీ–2026 మొదటి రన్నరప్‌గా బోడగల మహిమాన్విత విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌ రామదాస్‌పల్లెలో ఈనెల 7న జరిగిన ఫైనల్స్‌లో మొదటి రన్నర్‌ గా కిరీటం గెలుపొందారు. కడప జిల్లా కొత్త మాధవరం గ్రామానికి చెందిన డాక్టర్‌ శ్రీనివాసులు,రమ్యశ్రీల కుమార్తె అయిన మహిమాన్విత ప్రస్తుతం నెల్లూరులో బీడీఎస్‌ అభ్యసిస్తున్నారు. మహిమాన్వితను తల్లిదండ్రులు, అన్న డాక్టర్‌ హరికష్ణ కౌశిక్‌, సహచర విద్యార్థులు అభినందించారు.

చాపాడు: మండలంలోని అల్లాడుపల్లె శ్రీవీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం శాశ్వత హుండీ ఆదాయాలను లెక్కించారు. అన్నమయ్యజిల్లా దేవాదాయశాఖ అసిస్టెట్‌ కమిషనర్‌ విశ్వనాథ్‌ పర్యవేక్షణలో హుండీల ఆదాయాన్ని లెక్కించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్‌ పెరుగు వీరనారాయణ యాదవ్‌, ఏఓ శంకర్‌ బాలాజీ మాట్లాడుతూ 3 నెలల 28 రోజులకు సంబంధించిన హుండీలను లెక్కించగా రూ.8,59,761 నగదు, 1.500 గ్రాముల బంగారు, 416.500 గ్రాముల వెండి, అన్నదాన సత్రంలో ఉన్న హుండీని లెక్కించగా రూ.62,390 వచ్చిందన్నారు. మొత్తం నగదు రూ.9,22,151 వచ్చిందని వారు తెలిపారు. కమిటీ సభ్యులు, రెవెన్యూ, బ్యాంక్‌ సిబ్బంది, ఆలయ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు.

ముగిసిన ఇంటర్‌  ప్రాక్టికల్‌ పరీక్షలు 1
1/1

ముగిసిన ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement