ఉలవసాగుతో నష్టపోయాం | - | Sakshi
Sakshi News home page

ఉలవసాగుతో నష్టపోయాం

Feb 10 2026 7:36 AM | Updated on Feb 10 2026 7:36 AM

ఉలవసా

ఉలవసాగుతో నష్టపోయాం

ఉలవసాగుతో నష్టపోయాం పశుగ్రాసంగా వదిలేశాం

ఈఏడాది ఉలవ పంటసాగు చేసి భారీగా నష్టపోయాం. నేను రెండు ఎకరాల్లో ఉలవపంట సాగు చేశాను. వర్షాలు, వాతావరణం మార్పుల కారణంగా సాగుకు ఖర్చు చేసిన పెట్టుబడి కుడా ఈ ఎడాది రాలేదు. నాలుగునెలల పాటు పడిన కష్టం నేలపాలైంది.గత ఏడాదితో పోల్చితే 35శాతం దిగుబడి తక్కువగా వచ్చింది. ధరలు సగానికి పడిపోయాయి.

– నరసింహులు, ఉలవరైతు, పాతకోటపల్లె,

ఈసంవత్సరం సాగు చేసి న ఉలవపంట సరిగ్గా పండలేదు. వర్షాలకు సక్రమంగా కురవక వాతావరణం సరిగ్గా లేకపోవడంతో దిగుబడి తగ్గిపోయింది. ప్రస్తు తం పంటకోతలు చేపట్టినా ఎకరానికి ఒక క్వింటా దిగుబడి కూడా వచ్చే పరిస్థితిలేదు. కూలీల ఖర్చు లెక్కిస్తే ఇంకా చేతి నుంచి అదనంగా డబ్బులు భరించాల్సి వస్తోంది. దీంతో దిక్కుతోచక పండిన పంటను పశుగ్రాసంగా పొలాలపైనే వదిలేశాను.

– రమణ, ఉలవరైతు, గంగిరెడ్డిపల్లె

ఉలవసాగుతో నష్టపోయాం
1
1/1

ఉలవసాగుతో నష్టపోయాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement