ఆదాయ లక్ష్యాలు సాధించాలి
కలెక్టర్ నిశాంత్‌కుమార్
మదనపల్లె: ప్రభుత్వానికి ఆదాయాన్నిచ్చేశాఖలు నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ నిశాంత్‌కుమార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వివిధశాఖలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా పీఆర్, మున్సిపల్‌శాఖల్లో అభివృద్ధి పనులపై విధించిన జీఎస్టీని పక్కాగా వసూలయ్యేలా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాణిజ్య పన్నులు, రవాణా, మైనింగ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల, అటవీ, ఎకై ్సజ్‌శాఖలకు సంబంధించి వివరాలను తెలుసుకున్నారు. మోటారు వాహనాల షోరూమ్‌ల వద్ద వాటి ఇన్వాయిస్ ధరలను తెలిపేలా పట్టిక ఉండాలని, దానికిమించిన ధరలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వినియోగదారులు ఫిర్యాదు చేయాలని సూచించారు. నాటుసారా, నకిలీమద్యంపై కఠినచర్యలు తీసుకోవాలన్నారు. కర్ణాటక, తమిళనాడు మద్యం ఇక్కడికి అక్రమ రవాణా జరక్కుండా అడ్డుకోవాలన్నారు. నిరుపయోగంగా ఉన్న మైనింగ్ లీజులను నిబంధనల ప్రకారం పునరుద్ధరించి మైనింగ్ ప్రారంభించాలని ఆదేశించారు. ప్రజలకు రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ పై అవగాహన పెంచి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.


