● నీకు నేను... నాకు నువ్వు..
పుంగనూరు ‘మున్సిపాలిటిలో తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తున్నోడికి ఏముందని నా బిడ్డను ఇచ్చేది... ప్రేమించినంత మాత్రాన నా బిడ్డను ఇవ్వాలని రూల్ ఉందా.. ’ అని బాలిక తండ్రి అడ్డు చెప్పినా ఆ ప్రేమజంట వివాహం చేసుకుని నేడు ఆదర్శంగా నిలిచారు. పుంగనూరు పట్టణానికి చెందిన బి.నరేంద్రరాజు మున్సిపాలిటీలో రెవెన్యూ ఇన్స్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు 1996లో కర్ణాటకకు చెందిన ఎస్‌ఐ గోపాలక్రిష్ణ కుమార్తె శిల్పతో పరిచయం ఏర్పడింది. ఆమె బంధువుల ఇంటికి వచ్చేది. అలా పుంగనూరుకు వచ్చివెళ్తుండగా పరిచయం కాస్తా పెరిగి పెద్దదై ప్రేమలో పడ్డారు. కులాలు ఒకటైనా పెద్దలు స్థాయీబేధాలతో ప్రేమజంటను విడదీశారు.ఏడాది పాటు పోరాటం సాగించారు. చివరకు ప్రేమే జయించింది. 1997 జూన్ 27న అతికష్టం మీద వివాహం జరిగింది. అదే ఏడాది నరేంద్రరాజుకు ఉద్యోగం పర్మినెంట్ అయింది. దీంతో ఆ కుటుంబంలో సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ఇద్దరు కుమారు లు పునీత్‌రాజు,మనోజ్‌రాజుతో ప్రస్తుతం ఆ ప్రేమజంట సంతోషంగా జీవిస్తూ, ఆదర్శంగా నిలిచారు.
–నరేంద్ర, శిల్పా, పుంగనూరు


