తెగుతున్న వింగ్‌.. పదునెక్కుతున్న వన్‌ | - | Sakshi
Sakshi News home page

తెగుతున్న వింగ్‌.. పదునెక్కుతున్న వన్‌

Feb 14 2026 7:51 AM | Updated on Feb 14 2026 7:51 AM

తెగుత

తెగుతున్న వింగ్‌.. పదునెక్కుతున్న వన్‌

రైలుమా ర్గాలు

నందలూరు లాంటి స్టేషన్లలో కష్టం...

రైల్‌వన్‌యాప్‌తో బుకింగ్‌కార్యాలయాలకు మంగళం

కమర్షియల్‌ వ్యస్థలకు బీటలు

రైల్‌వన్‌ యాప్‌

రైలు

రైల్వేస్టేషన్‌లో బుకింగ్‌ కార్యాలయం

రాజంపేట: ఇక రానున్న రోజుల్లో రైల్‌వన్‌యాప్‌తో రైలెక్కాల్సిన పరిస్థితులు ఆవిష్కృతమవుతున్నాయి. ఆ విధంగా రైల్వేశాఖ రైల్‌వన్‌యాప్‌కు పదనుపెడుతోంది.దీనిపై ప్రయాణికులకు అవగాహన కల్పిస్తోంది. ఫలితంగా కమర్షియల్‌ వింగ్‌ను బలహీనపరిచే దిశగా రైల్వేశాఖ పయనిస్తోంది. స్టేషన్‌మాస్టర్లతో టికెట్ల కొట్టించాలని, అనవసరం వ్యయం తగ్గించేందుకు రైల్‌వన్‌యాప్‌ను అస్త్రంగా రైల్వేశాఖ ప్రయోగిస్తోందని రైల్వే కార్మికవర్గాలు అభిప్రాయపడున్నాయి. ఇప్పటికే అన్ని స్టేషన్లలో రైల్‌వన్‌యాప్‌ ప్రచారహోర్డింగ్‌లను ఏర్పాటుచేశారు. బ్రిటీషు కాలం నుంచి కొనసాగుతూ వస్తున్న రైల్వే కమర్షియల్‌ విభాగం కనుమరుగు కానుంది. ప్రతి రైల్వేస్టేషన్‌లో రైల్వే బుకింగ్‌, పార్శిల్‌ బుకింగ్‌ కార్యాలయాలు ఉండేవి. వాటిని రాను..రాను తీసేస్తూ వస్తున్నారు. కేంద్ర రైల్వేమంత్రిత్వశాఖ తీసుకొచ్చిన రైల్వేవన్‌యాప్‌ సర్వం అన్నట్లుగా స్టేషన్‌లోని బుకింగ్‌లను ఎత్తివేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఫలితంగా కమర్షియల్‌ సిబ్బంది మనుగడకు ముప్పు వాటిల్లే పరిస్థితులు ఉన్నాయని కార్మికసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

అవగాహన

జిల్లా రైలుమార్గంలో పలు రైల్వేస్టేషన్లకు టికెట్‌ కోసం, రిజర్వేషన్‌ చేసుకోవడానికి వస్తున్న ప్రయాణికులకు కమర్షియల్‌ సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు.టికెట్‌ ఏ విధంగా బుక్‌ చేసుకోవాలి, రిజర్వేషన్‌ ఎలా చేసుకోవాలి, రైళ్ల రాకపోకలు ఏ విధంగా తెలుసుకోవాలో రైల్‌వన్‌యాప్‌లో తెలియచేస్తున్నారు. బుకింగ్‌ కౌంటర్‌ టికెట్‌ జారీ చేయకుండా ప్రయాణికుల మొౖబైల్‌ నుంచి టికెట్లను జారీ చేయించడం, రిజర్వేషన్‌ చేయిస్తున్నారు. ఈ విధంగా చేయాలని ఇప్పటికే రైల్వే ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెలువడ్డాయి.

● స్టేషన్లలో బుకింగ్‌ కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి మంగళం పాడనున్నారు. స్టేషన్లలో బుకింగ్‌ కార్యాలయాలను ఎత్తివేస్తే ఆ డిపార్టుమెంట్‌ అంటిపెట్టుకొని పనిచేస్తున్న కమర్షియల్‌ సిబ్బందిని వేరే విధంగా వినియోగించుకోనున్నారు. చాలమందిని టీసీలుగా రైలు ఎక్కించనున్నారు. మరికొందరిని ఇతర డిపార్టుమెంట్‌లోకి పంపించనున్నారు. ఇదంతా చాపకిందనీరుగా సాగుతోందని రైల్వేవర్గాలు సమాచారం.

స్టేషన్‌మాస్టర్లే టికెట్‌ జారీ చేసుకోవాలంటా...

స్టేషన్‌మాస్టర్లే టికెట్‌ జారీ చేసుకోవాలని ఉన్నతస్థాయి నుంచి సంకేతాలను పంపిస్తున్నారు. ఓ వైపు ప్రయాణీకులు టికెట్లు ఇవ్వాలి.. మరోవైపు రైళ్ల రాకపోకల గురించి సిగ్నల్‌ ఇవ్వాలి.. కంట్రోలర్‌తో సంభాషించాలి.. ఇలాంటి అనేక సమస్యలు ఆపరేటింగ్‌ వ్యవస్థలో తలెత్తనున్నాయి. ఫలితంగా స్టేషన్‌మాస్టర్లు ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉందని రైల్వే నిపుణులు చెపుతున్నారు. ఒక్కోసారి రైళ్ల ప్రమాదానికి స్టేషన్‌మాస్టర్లు కారణమయ్యే పరిస్థితులు నెలకొంటాయని కార్మిక సంఘాలు వాపోతున్నాయి. బ్రిటీషు కాలం నుంచి బుకింగ్‌ వ్యవస్థను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడానికి కూడా అదే కారణమని రైల్వేశాఖలోని సీనియర్లు చెబుతున్నారు. ప్రయాణికులకు టికెట్‌ ఇచ్చి, మళ్లీ రైళ్ల నిర్వహణ అంటే కష్టమని, ఈవిధానాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని స్టేషన్‌మాస్టర్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు. కడప, నందలూరు, ఎర్రగుంట్లలో బుకింగ్‌ కార్యాలయాలు కొనసాగించే దిశగా రైల్వే యోచన చేస్తోంది. మిగిలిన రైల్వేస్టేషన్లలో రైల్‌వన్‌యాప్‌, ప్రైవేట్‌ ఆపరేటర్‌ వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా రైల్వేశాఖ అడుగులు వేస్తున్నట్లు కార్మికవర్గాలు చర్చించుకుంటున్నారు.

నందలూరు స్టేషన్‌లో స్టేషన్‌మాస్టర్‌ టికెట్‌ ఇచ్చుకోవాలంటే కష్టమని రైల్వే నిపుణులు చెపుతున్నారు. నిరంతరం గూడ్స్‌ రైళ్ల రద్దీతోనే స్టేషన్‌మాస్టర్‌కు సరిపోతుంది. రోజుకు 30కిపైగా గూడ్స్‌ రైళ్లు, రెగ్యులర్‌, స్పెషల్‌ ట్రైన్స్‌ నడుస్తుంటాయి. ఇటాంటి పరిస్థితిలో రైల్‌వన్‌యాప్‌ వ్యవస్థ కోసం బుకింగ్‌ కార్యాలయాన్ని ఎత్తివేయడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. రైల్వే భధ్రత అంశం కూడా ఇందులో ఇమిడివుంది. వందలాది మంది రైల్వే కార్మికులు, ఉద్యోగులు, రన్నింగ్‌స్టాప్‌ నందలూరు రైల్వేకేంద్రంగా రాకపోకలు సాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బుకింగ్‌ వ్యవస్థను కొనసాగించాలని రైల్వేకార్మికవర్గాలు కోరుతున్నాయి.

తెగుతున్న వింగ్‌.. పదునెక్కుతున్న వన్‌1
1/4

తెగుతున్న వింగ్‌.. పదునెక్కుతున్న వన్‌

తెగుతున్న వింగ్‌.. పదునెక్కుతున్న వన్‌2
2/4

తెగుతున్న వింగ్‌.. పదునెక్కుతున్న వన్‌

తెగుతున్న వింగ్‌.. పదునెక్కుతున్న వన్‌3
3/4

తెగుతున్న వింగ్‌.. పదునెక్కుతున్న వన్‌

తెగుతున్న వింగ్‌.. పదునెక్కుతున్న వన్‌4
4/4

తెగుతున్న వింగ్‌.. పదునెక్కుతున్న వన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement