బాలికా విద్యాలయాల్లో ఉత్తమ విద్యను అందించాలి | - | Sakshi
Sakshi News home page

బాలికా విద్యాలయాల్లో ఉత్తమ విద్యను అందించాలి

Feb 14 2026 7:51 AM | Updated on Feb 14 2026 7:51 AM

బాలికా విద్యాలయాల్లో ఉత్తమ విద్యను అందించాలి

బాలికా విద్యాలయాల్లో ఉత్తమ విద్యను అందించాలి

బాలికా విద్యాలయాల్లో ఉత్తమ విద్యను అందించాలి

మదనపల్లె సిటీ: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల ప్రిన్సిపాళ్లు, మోడల్‌ స్కూళ్ల వార్డెన్లు ఉత్తమ విద్యను అందించాలని సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్‌ అనురాధ అన్నారు. శుక్రవారం మదనపల్లె సమీపంలోని గ్రీన్‌వ్యాలీ పాఠశాలలో ఎన్‌ఐఈపీఏ సహకారంతో అన్నమయ్య, కడప, సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన కేజీబీవీ ప్రత్యేక అధికారులకు సాధికారత కల్పించే లక్ష్యంతో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. బాలికా విద్య అణగారిన, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి తోడ్పటంలో కేజీబీవీ ఒక పరివర్తనాత్మక పథమని తెలిపారు. ఈ పథకంలో ప్రత్యేక అధికారులు నాయకులుగా, సంరక్షులుగా, మార్గదర్శకులుగా, సమర్థ నిర్వాహకులుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో సమర్థవంతంగా అమలు చేసినపుపడే ఉత్తమ ఫలితాలు సాధించగలమని తెలిపారు. శిక్షణా కార్యక్రమంలో బాలిక విద్య ప్రాముఖ్యత, ప్రత్యేకాధికారుల బా ధ్యతలు, ఆర్థిక నిర్వహణ, నిధుల వినియోగం, ఐసీటీ వినియోగం, ఆరోగ్యం, పరశుభ్రత, భ ద్రత,రక్షణ, జెండర్‌ అవగాహన వంటి అంశాలపై విస్తృత అవగాహన కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జీసీడీఓలు సుమతి, రూత్‌మేరీ,రేవతి, సీఎంఓ కరుణాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement