ముగ్గరిపై కేసు నమోదు
ములకలచెరువు: వ్యవసాయం చేసుకుంటున్న తండ్రి కొడుకులపై దాయాదులు దాడిచేసిగాయపరిచిన సంఘటనపై పోలీసులు ముగ్గరిపై సోమవారం కేసునమోదు చేశారు. ఎస్‌ఐ ప్రతాప్ కథనం మేరకు... మండలంలోని పాతముకలచెరువుకు చెందిన రెడ్డెప్ప, సతీష్‌లపై విజయ్‌కుమార్, సునీల్, విజలక్ష్మిలు రాళ్లతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచినట్లు చెప్పారు. బాధితుల ఫిర్యాదు మేరకు ముగ్గరిపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.
బార్యను మోసం చేసిన కేసులో భర్తకు జైలుశిక్ష
సంబేపల్లె : భార్యను మోసం చేసిన కేసులో భర్త వెంకటేశ్వర్లకు కడప నాలుగో అదనపు జిల్లా జడ్జికోర్టు (స్పెషల్ ఎస్సీ,ఎస్టీ కోర్ట్) న్యాయమూర్తి జి.దీనబాబు జైలుశిక్ష విధించినట్లు సంబేపల్లె పోలీసులు తెలిపారు. పోలీసలు వివరాలమేరకు మండల పరిధిలోని దేవపట్ల గ్రామానికి చెందిన డి. రాధను పెళ్లి చేసుకున్న బి. వెంకట్రమణ అమెకు తెలియకుండా అదనపు కట్నం కోసం మరో వివాహం చేసుకొన్నాడు. రాధను వేధిస్తూ, కులంపేరుతో అసభ్యకర పదజాలంతో దూషిస్తున్నట్లు 2018 జనవరి 6న సంబేపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.


