పట్టువస్త్రాల సమర్పణ
తంబళ్లపల్లె : మల్లయ్యకొండ మల్లికార్జునస్వామికి పెద్దమండ్యం మండలం అవికేనాయక్‌తాండాకు చెందిన హాంధీరాంబావాజీ ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు బి.శివానాయక్ పట్టువస్త్రాలు సమర్పించారు. స్వగ్రామం నుంచి టెంకాయపట్టలు, పూలతో అలంకరించిన ట్రాక్టర్లతో బత్తినిగారిపల్లె పిల్లనగ్రోవి కళాకారుల బృందం విన్యాసాలతో ఊరేగింపుగా మల్లయ్యకొండకు తీసుకెళ్లారు. పట్టువస్త్రాలను స్వామివారికి సమర్పించారు. ప్రత్యేక పూజలతో మొక్కులు తీర్చుకున్నారు. ఎంపిటీసీ చంద్రానాయక్, శివమాల భక్తులు పాల్గొన్నారు.
పేకాటశిబిరంపై దాడులు
చౌడేపల్లె : మండలంలోని దిగువపల్లె పంచాయతీ బోయకొండ భవానీ నగర్‌లో శుక్ర వారం రాత్రి పేకాట శిబిరంపై పోలీసులు మెరుపుదాడి చేసి తొమ్మిదిమందిని అదుపులోకి తీసుకొన్నట్లు ఎస్‌ఐ నాగేశ్వరరావు శనివారం తెలిపారు.శుక్రవారం రాత్రి ఓ భవనం లోని రెండోఅంతస్తులో రహస్యంగా పేకాట ఆడుతున్నట్లు అందిన సమాచారం మేరకు దాడులు చేశామన్నారు.గదిలో పేకాట ఆడుతున్న 9 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ.1,78,200 నగదు, తొమ్మిదిసెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొన్నట్లు ఎస్‌ఐ తెలిపారు. పట్టుడినవారందరూ మదనపల్లె, ముళబాగల్, బెంగళూరుకు చెందిన వారుగా గుర్తించారు. వీరిని పుంగనూరు కోర్టుకు తరలించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
విద్యార్థి ఆత్మహత్య
కలసపాడు : మండలంలోని పుల్లారెడ్డిపల్లె గ్రామానికి చెందిన రాచకొండుగురుతేజ (16) శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు రాచకొండుచిన్నగురయ్య, గురమ్మల కుమారుడైన గురుతేజ కలసపాడులోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. గురుతేజకు కొన్నేళ్ల నుంచి చర్మవ్యాధి కారణంగా ఆసుపత్రిల్లో వైద్యం అందించినా తగ్గకపోవడంతో చదువుపై శ్రద్ధ చూడపం లేదన్నారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించలేనని మనస్తాపానికి గురై శుక్రవారం రాత్రి భోజనం చేసిన తర్వాత చర్మవ్యాధికి సంబంధించిన ఆయింట్‌మెంట్ క్రీమ్‌ను పూసు కుని చదువుకుకోవాలని తల్లికి చెప్పి గదిలోకి వెళ్లిపోయాడు. సుమారు రాత్రి 10 గంటల సమయంలో తల్లి చూడగా గదిలోని ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
9మంది అరెస్ట్, రూ.1.78లక్షలు స్వాధీనం
పట్టువస్త్రాల సమర్పణ


