విచారణకు హాజరు | - | Sakshi
Sakshi News home page

విచారణకు హాజరు

Feb 14 2026 7:51 AM | Updated on Feb 14 2026 7:51 AM

విచారణకు హాజరు

విచారణకు హాజరు

రాయచోటి : 104 ప్రభుత్వ వాహనాల ధ్వంసం, అపహరణ కేసులో అనుమానితులుగా ఉన్న ఎఫ్‌–1 శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ నరసింహులు, డంపింగ్‌యార్డ్‌ వాచ్‌మెన్‌ ప్రసాద్‌లను రాయచోటి అర్బన్‌ పోలీసులు విచారణ చేశారు. శుక్రవారం ఉదయం వారిద్దరినీ స్టేషన్‌కు పిలిపించి సాయంత్రం వరకు పోలీసులు తమదైన శైలిలో విచారణ చేసినట్లు సమాచారం. 104 వాహనాలను ధ్వంసం చేసి వాటి విడిభాగాలను ఎక్కడ విక్రయించారు? వీటి విక్రయంలో ఎవరి పాత్ర ఉందన్న విషయాలపై ఆరా తీసినట్లు తెలిసింది. 104 వాహనాలతోపాటు రాయచోటి మున్సిపాలిటీలో పారిశుధ్యం వాహనాల అపహరణకు కారణమైన ఎఫ్‌–1 శానిటరీ అధికారి నరసింహులుపై కేసు నమోదు చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌బాషా, పలువురు కౌన్సిలర్లు సీఐకు ఫిర్యాదు చేశారు.

ప్రాధాన్యత రంగాలకు

రుణాలు మంజూరు చేయాలి

మదనపల్లె రూరల్‌ : జిల్లా వార్షిక ప్రణాళికలో భాగంగా ప్రాధాన్యత రంగాలకు రుణాలు సకాలంలో అందించి, జిల్లా ఆర్థికాభివృద్ధికి బ్యాంకర్లు సహకరించాలని అన్నమయ్య జిల్లా లీడ్‌ డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ జి.ఆంజనేయులు కోరారు. శుక్రవారం స్థానిక వెలుగు కార్యాలయంలో డిసెంబర్‌ 2025కు సంబంధించి జాయింట్‌ మండల లెవల్‌ బ్యాంకర్స్‌ కమిటీ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం 16,619 కోట్లు కాగా, డిసెంబర్‌ నాటికి 18,042 కోట్లు దాదాపు 108 శాతానికి పైగా లక్ష్యాలను సాధించామన్నారు. అన్నమయ్య జిల్లాలో సూర్యఘర్‌, విశ్వకర్మ, పీఎంఈజీపీ, హ్యాండ్లూమ్‌, టెక్స్‌టైల్‌, వీవర్స్‌ ముద్ర యోజన, విద్యారుణాలు తదితర రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పెద్ద సంఖ్యలో లోన్లు మంజూరు చేసి ఉపాధి కల్పించాల్సిందిగా బ్యాంకర్లకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు బ్యాంకర్లు లబ్ధిదారులకు రుణాలు అందజేసి వారి ఆర్థిక పురోగతికి సహాయ పడాలన్నారు. పెండింగ్‌ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని సూచించారు. జిల్లా లీడ్‌ కార్యాలయం రాయచోటి నుంచి మదనపల్లె బెంగళూరు రోడ్డులోని బీటీ కాలేజీ హాస్టల్‌లోకి మార్చడం జరిగిందన్నారు. కార్యక్రమంలో డీపీఎం ప్రసాద్‌రెడ్డి, హ్యాండ్లూమ్స్‌ జిల్లా అసిస్టెంట్‌ ప్రవీణ్‌కుమార్‌, ఏపీఎం ఖిజర్‌ఖాన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement