శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం
ఒంటిమిట్ట: ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం శాస్త్రోక్తంగా మూలవిరాట్‌లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ముందుగా ప్రధాన అర్చకులు వీణారాఘవాచార్యులు మూల విరాట్‌కి పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం సీతారామలక్ష్మణ మూర్తులకు ప్రత్యేక పూజలతో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు.
మదనపల్లె టౌన్: ఇంధన పొదుపుపై ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని అన్నమయ్య జిల్లా అగ్నిమాపక అధికారి ఆదినారాయణ తెలిపారు. శనివారం మదనపల్లె బెంగుళూరు బస్టాండులో ఉన్న ఓ పెట్రోల్ బంకు ఆవరణలో గ్యాస్ ఏజెన్సీలు, డెలివరీ బాయ్‌లతో ఫైర్ సేప్టీ, ఇంధన పొదుపుపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎఫ్‌ఓ మాట్లాడుతూ ప్రజలకు అనునిత్యం ఎంతో అవసరమైన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ఇంధనాల ఆవశ్యకత, పొదుపు అంశాలపై క్షుణ్ణంగా వివరించి చైతన్యపరిచారు. వాక్‌థాన్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. మదనపల్లె అగ్నిమాపక అధికారి శివప్ప, మదనపల్లె, రామసుముద్రం, కురబలకోట, తంబళ్లపల్లె, వాల్మీకిపురం మండలాల గ్యాస్ డీలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం


