● ప్రాజెక్టులపై చిన్నచూపు | - | Sakshi
Sakshi News home page

● ప్రాజెక్టులపై చిన్నచూపు

Feb 15 2026 7:23 AM | Updated on Feb 15 2026 7:23 AM

● ప్రాజెక్టులపై చిన్నచూపు

● ప్రాజెక్టులపై చిన్నచూపు

● ప్రాజెక్టులపై చిన్నచూపు

చంద్రబాబు సర్కార్‌ 2026–27 వార్షిక బడ్జెట్‌లో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై శీతకన్ను వేసింది. తెగిపోయిన అన్నమయ్య ప్రాజెక్టు ఊసే లేదు. గాలేరి–నగరి సుజల స్రవంతి పథకంపై చిత్తశుద్ధి కన్పించలేదు. జీఎన్‌ఎస్‌ఎస్‌–హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ అనుసంధానం చేసి కుప్పానికి సైతం నీరు ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ సర్కార్‌ భావిస్తే, కూటమి సర్కార్‌ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఇప్పటికే జీఎన్‌ఎస్‌ఎస్‌ దాదాపు రూ.2వేల కోట్లు పనులు పూర్తయి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా రూ.665.37కోట్లు బడ్జెట్‌ కేటాయింపు చేశారు. జీఎన్‌ఎస్‌ఎస్‌ పరిధిలో పనులు ముందడుగు పడే అవకాశమే లేద ని నిపుణులు వివరిస్తున్నారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ రూ.2,621 కోట్లు కేటాయించగా, అందులో 25శాతం మాత్రమే జీఎన్‌ఎస్‌ఎస్‌ కేటాయించడం వెనుక కూటమి సర్కార్‌ దుర్భుద్ధి తేటతెల్లమౌతోందని రాజకీయ పక్షాలు ఆరోపిస్తున్నా యి. జీఎన్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కాలువ పనుల పురో గతి ప్రశ్నార్థకంగా మారింది. కేసీ కెనాల్‌ ఆయక ట్టుకు ప్రాణప్రదమైన రాజోలి ప్రాజెక్టు ప్రస్తావనే లేదు. బడ్జెట్‌లో నిధుల కేటాయింపులే లేకపోవ డం సర్కారు కక్షపూరిత విధానానికి నిదర్శనం.

నీటి ప్రాజెక్టుల కేటాయింపులు...రూ.కోట్లలో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement