హంద్రీ–నీవా గోవిందా
కరువురైతుల కల్పతరువు హంద్రీ–నీవా పూర్తికి కూటమి ప్రభుత్వానికి శ్రద్ధ కనిపించలేదు. జిల్లాలో రూ.925 కోట్లతో పను లు చేపట్టేందుకు ప్రతిపాదించారు. బడ్జెట్‌లో మొత్తం ప్రాజెక్టు పనులకు రూ.2,500 కోట్లు అడిగితే బడ్జెట్‌లో రూ.800 కోట్లు కేటాయించారు. సీమ జిల్లాల్లో పనుల పూర్తికి ఈ నిధులు సరిపోవని ప్రభుత్వానికి తెలి యదా. ఈ నిధులు జిల్లాలో జరగాల్సిన పను లకే సరిపోవు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాజెక్టును ప్రభుత్వం ఎప్పుడు పూర్తి చేస్తుంది. వెనుకబ డిన తంబళ్లపల్లె నియోజకవర్గ అభివృద్దిపైనా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. అభివృద్ధి, బడు గు, బలహీనవర్గాలపై కనికరం చూపని బడ్జెట్ ఇది. –ద్వారకనాథరెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే
బడ్జెట్ మోసపూరిత విధానాలతో రూపొందించబడింది. బడ్జెట్‌లో ఆదా యం రూ.1,37,000 కోట్లు వస్తుందని చెప్పడం హాస్యాస్పదం. వాస్తవానికి రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, ఆర్థిక వనరులు, రెవెన్యూ అంచనా ప్రకారం రూ.97 వేల కోట్లు వరకు మాత్రమే ఆదా యం వచ్చే అవకాశం ఉంది. సుమారు 40–50 వేల కోట్లు అదనంగా ఆదాయం వస్తుందని చూపిస్తూ ప్రజలను మోసం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. చంద్రబాబు నాయుడి పాలనంతా మోసపూరితమే. అన్నమయ్య జిల్లాకు, రాయచోటికి కొత్తగా ఈ బడ్జెట్‌లో కేటాయింపులేవీ జరగలేదు.
– గడికోట శ్రీకాంత్ రెడ్డి,
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
హంద్రీ–నీవా గోవిందా


