వెన్నుపోటు బాబు
సూపర్ సిక్స్ హామీలకు మంగళం
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో సూపర్ సిక్స్ హామీలకు మంగళం పాడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇరవై నెలల కాలంలో కనీసం అమలు చేయని పథకాల ఊసెత్తకుండా ప్రజలను మరోసారి నిక్కచ్చిగా మోసగించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కింది. ఆడబిడ్డ నిధి కింద 18సంవత్సరాలు నుండి ప్రతి మహిళకు నెలకు 1500 ఇస్తానన్న ప్రధాన హామీని విస్మరించిన కూటమి ప్రభుత్వాన్ని మహిళలు క్షమించరు.
– నల్లారి తిమ్మారెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎక్సిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు
50 ఏళ్లకు ఫించను ఉత్తిదే
మైనార్టి, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఏళ్లకే ఫించను ఇస్తామని గత ఎన్నికల్లో కూటమి నేతలు ప్రజలకు హామీ ఇచ్చి, గద్దెనెక్కి ఇరవైనెలలు గడిచినా, రెండు పర్యాయాలు బడ్జెట్ ప్రవేశ పెట్టినా రెండు సార్లు 50 ఏళ్ల పింఛన్ల పథకానికి ఒక్క రూపాయి కేటాయించకపోవడం దారుణం. పైగా సూపర్ సిక్స్ పథకాలు పూర్తిగా అమలు చేసేసినట్లు సీఎం చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదం.
– డాక్టర్ ఇక్బాల్ అహ్మద్, వైఎస్సార్‌సీపీ కేంద్ర ఎక్సిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు
వెన్నుపోటు బాబు


