లక్ష్యాలను మించి రుణాలు ఇచ్చాం: ఎల్‌డీఎం
మదనపల్లె టౌన్: రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను ముందుగానే పూర్తి చేసి, ప్రణాళికా బద్ధంగా బ్యాంకులకు రు ణాలు మంజూరు చేసిన ట్లు అన్నమయ్య జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ ఆంజనేయులు తెలిపారు. బుధవారం ఆయన మదనపల్లె ఎల్‌డీఎం ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 2025–26 సంవత్సరానికి ప్రభుత్వం రూ.16.619 కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్దేశించడంతో ఆ లక్ష్యాలను సిబ్బంది సమష్టి కృషితో ప్రాధాన్యత, అప్రాధాన్యత పద్ధతుల్లో రూ.18.42 కోట్ల రుణాలను లబ్ధిదారులకు మంజూరు చేసినట్లు తెలిపారు. వీటిలో రూ.30 లక్షల వరకు గృహ రుణాలు, రూ.25 లక్షల వరకు విద్యా రుణాలు, పీఎం స్వానిధి, సూర్య ఘర, విశ్వకర్మ, ముద్ర రుణా లు, ఎస్‌హెచ్‌జి రుణాలు రూ.20 లక్షల కు మించకుండా మంజూరు చేసినట్లు తెలిపారు.మిగిలిన సంవత్స రాంతంలోపు రూ.20 కోట్ల రుణాలను ఇస్తామన్నారు.


