బడ్జెట్ పేరుతో మళ్లీ దగా
చంద్రబాబు ప్రభుత్వం మరో సారి అంకెల గారడీతో రాష్ట్ర ప్రజలను దగా చేసింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏ విధంగా మోసం చేశారో ఇప్పుడు బడ్జెట్ పేరుతో అదేవిధంగా దగా చేశారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి పథకానికి నిధులు కేటాయింపు చేయలేదు. మహిళలకు ఇచ్చిన హామీకి బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా నిరాశ పరిచింది.ప్రతి మహిళకు రూ.1500 నెలకు ఇస్తామని చెప్పి ఆ హామీని కూడా విస్మరించారు. అన్నదాతలకు అరకొర నిధులు కేటాయింపుతో మోసం చేశారు.
–గార్ల చంద్రమౌళి, వైఎస్సార్‌సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి
బడ్జెట్ పేరుతో మళ్లీ దగా


