పుంగనూరు రౌడీ షీటర్‌ కర్నాటకలో దారుణ హత్య | - | Sakshi
Sakshi News home page

పుంగనూరు రౌడీ షీటర్‌ కర్నాటకలో దారుణ హత్య

Feb 11 2026 7:32 AM | Updated on Feb 11 2026 7:32 AM

పుంగన

పుంగనూరు రౌడీ షీటర్‌ కర్నాటకలో దారుణ హత్య

కర్నాటక, ఆంధ్ర రాష్ట్రాల్లో పలు కేసుల్లో నేరస్తుడు

పుంగనూరు : రౌడీషీటర్‌, అంత ర్‌ రాష్ట్ర నేరస్తుడు పుంగనూరు స మీపంలోని కర్నాటక సరిహద్దు హెబ్బిణి గ్రామ పొలాల్లో హత్య కు గురయ్యాడు. ఈ సంఘటన ఆలస్యంగా మంగళవారం వెలుగు చూసింది. పుంగనూరు మండలం కురప్పల్లెకి చెందిన చిరంజీవి కుమారుడు భాస్కర్‌(25) అనే వ్యక్తి చిన్నతనం నుంచి పలు నేరాల్లో నిందితుడిగా ఉన్నాడు. పుంగనూరు స్టేషన్‌లో 6 కేసులు, రామసముద్రం, బెంగళూరు, నంగిలి పోలీస్‌స్టేషన్లలో 4 కేసులు ఉన్నాయి. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఇతనిపై రౌడీషీటర్‌ 794 నెంబరుతో షీటు ఓపెన్‌ చేశారు. ఇలా ఉండగా ఇతని తండ్రి కూడా గతంలో హత్యకు గురయ్యాడు. భాస్కర్‌ను ఈనెల 8న సాయంత్రం అతని స్నేహితులు ఇంటి నుంచి ద్విచక్రవాహనంలో తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తరువాత ఇంటికి రాలేదు. ఇలా ఉండగా మంగళవారం ఉదయం కర్నాటక హెబ్బిణి పొలాల్లో మృతదేహాం పడి ఉండటాన్ని గ్రామస్తులు కొనుగొని నంగిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించారు. భాస్కర్‌ను గొంతుకోసి హత్య చేసినట్లు నిర్ధారించారు. కాగా హత్యకు ముందు మద్యం సేవించారని, అక్కడ మద్యం బాటిళ్లు పడిఉండటాన్ని చూసి నిర్ధారించారు. కాగా నిందితుడు పలు నేరాల్లో రౌడీషీటర్‌గా ఉండటంతో ఆ కేసులకు సంబంధించిన వారు ఎవరైన హత్య చేశారా..? లేక ఆర్థిక లావాదేవీలా, వివాహేతర సంబంధాలా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, పోస్టుమార్టంకు తరలించి, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.

పుంగనూరు రౌడీ షీటర్‌ కర్నాటకలో దారుణ హత్య 1
1/1

పుంగనూరు రౌడీ షీటర్‌ కర్నాటకలో దారుణ హత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement