రైల్వేస్టేషన్‌ మెట్లపై నుంచి పడి.. | - | Sakshi
Sakshi News home page

రైల్వేస్టేషన్‌ మెట్లపై నుంచి పడి..

Feb 15 2026 7:23 AM | Updated on Feb 15 2026 7:23 AM

రైల్వ

రైల్వేస్టేషన్‌ మెట్లపై నుంచి పడి..

మదనపల్లె టౌన్‌ : మదనపల్లె రైల్వేస్టేషన్‌ మెట్లపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. ఘటనపై బాధితురాలు తెలిపిన వివరాలు.. కురబలకోట మండలం, పెద్దపల్లెకు చెందిన వెంకటరమణ భార్య కె.రెడ్డెమ్మ(65) పని నిమిత్తం శనివారం మదనపల్లె మండలం, సీటీఎంకు వచ్చింది. అక్కడి క్రాస్‌ రోడ్డు సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్‌కు వెళ్లింది. అవతల వైపునకు వెళ్లడానికి పట్టాలు దాటేందుకు మెట్లపైకి వెళ్లింది. అవతల వైపున దిగుతుండడగా ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి కిందపడి కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడింది. స్థానికులు గమనించి బాధితురాలిని108 వాహనంలో చికిత్స కోసం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్సల అనంతరం ఎముకల డాక్టర్లు ఆస్పత్రిలో అందుబాటులో లేరని తిరుపతికి రెఫర్‌ చేశారు. ఘటనపై కేసు దర్యాప్తులో ఉంది.

పోలీసుల విచారణ

ములకలచెరువు : మండలంలోని సోంపల్లెలో వెలసిన శ్రీ చెన్నకేశవస్వామి ఆలయంలో గురువారం రాత్రి గుప్తనిధుల కోసం గుర్తు తెలితని దుండగులు కల్యాణ మండపంలోని తామర మొగ్గను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై సెక్యూరిటీ రమణప్ప శనివారం ఎస్‌ఐ ప్రతాప్‌, పురావస్తుశాఖ అధికారి బాలక్రిష్ణారెడ్డిలు విచారించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... ఘటనపై పలు అనుమానాలు ఉన్నట్లు వారు అన్నారు. ఆలయానికి సీసీ కెమెరాలను అమర్చడంతో విద్యుత్‌ కనెక్షన్‌కు సంబంధించి మెయిన్‌ వైరును దుండగులు తొలగించారన్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని వారి వివరించారు.

గాయపడిన వ్యక్తి మృతి

చింతకొమ్మదిన్నె : మండలంలోని బుగ్గలేటిపల్లె వద్ద శుక్రవారం రాత్రి ఆటో–టిప్పర్‌ ఢీకొన్న సంఘటనలో గాయపడిన ఆటోడ్రైవర్‌ శీలం చంద్ర రిమ్స్‌ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు చింతకొమ్మదిన్నె మండలంలోని ఇప్పపెంట గ్రామం నివాసి. మృతునికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

రైల్వేస్టేషన్‌ మెట్లపై నుంచి పడి..
1
1/1

రైల్వేస్టేషన్‌ మెట్లపై నుంచి పడి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement