జూదరుల అరెస్టు
సదుం : జూదం ఆడుతున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ విష్ణునారాయణ సోమవారం తెలిపారు. తుమ్మగుంటపల్లె సమీపంలో జూదం ఆడుతున్నట్లు సమాచారం రావడంతో సిబ్బందితో కలసి దాడి చేశామన్నారు. తమను చూసి వారు పారిపోయేందుకు ప్రయత్నించగా వెంబడించి పట్టుకున్నట్లు చెప్పారు. ముగ్గురు పట్టుబడగా.. కొంతమంది పారిపోయారన్నారు. వారి నుంచి రూ.46,500 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.
దరఖాస్తు చేసుకోండి
పుంగనూరు : పెద్దపంజాణి మండలంలో గీతకులాలకు చెందిన మద్యంషాపు కేటాయింపునకు ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ సురేష్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వాదేశాల మేరకు ఈనెల 21వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కలెక్టర్ ఆధ్వర్యంలో 23న లాటరీ ద్వారా షాపు కేటాయించనున్నట్లు తెలిపారు.
ఏడేళ్ల బాలిక అదృశ్యం
మదనపల్లె టౌన్ : మదనపల్లె పట్టణంలో సోమవారం సాయంత్రం ఏడేళ్ల బాలిక మిస్సింగ్ కలకలం రేపుతోంది. బాధితురాలి కుటుంబీకులు స్థానిక వన్ టౌన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. నీరుగట్టువారిపల్లెలో కాపురం ఉంటున్న చేనేత కార్మికుడు గోపినాథ్ కుమార్తె రుషిక ప్రియ(07) స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో రెండోతరగతి చదువుతోంది. సాయంత్రం స్నేహితులతో కలసి కాట్లాటపల్లె రోడ్డుకు వచ్చింది. అక్కడ అదృశ్యమైంది. రాత్రి 8 గంటలైనా ఇంటికి రాక పోవడంతో బాలిక తండ్రి పలు చోట్ల గాలించాడు. ఆచూకి లబించక పోవడంతో వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహ్మద్ రఫి తెలిపారు.
బైక్ చోరీ
మదనపల్లె టౌన్ : మదనపల్లెలో ఆర్టీసీ కండక్టర్‌కు చెందిన బైకును దొంగలు చోరీ చేశారు. ఘటనపై బాధితుడు తాలూక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు..స్థానిక చిప్పిలిలో కాపురం ఉంటున్న జయరామిరెడ్డి ఒంటి ముందు నిలిపిన బైకును రాత్రి దొంగలు ఎత్తుకెళ్లారు. ఉదయం గుర్తించిన బాధితుడు వెంటనే వెళ్లి తాలుక పోలీసులకు పిర్యాదు చేశాడు.


