వక్ఫ్‌భూమిలో ఈ నిర్మాణాలు ఎవరివి? | - | Sakshi
Sakshi News home page

వక్ఫ్‌భూమిలో ఈ నిర్మాణాలు ఎవరివి?

Feb 10 2026 7:37 AM | Updated on Feb 10 2026 7:37 AM

వక్ఫ్‌భూమిలో ఈ నిర్మాణాలు ఎవరివి?

వక్ఫ్‌భూమిలో ఈ నిర్మాణాలు ఎవరివి?

సాక్షి టాస్క్‌ఫోర్స్‌ : మదనపల్లె పట్టణంలోని వక్ఫ్‌భూమిలో జరుగుతున్న నిర్మాణాలపై ముస్లిం వర్గాల్లో చర్చ సాగుతోంది. టిప్పు సుల్తాన్‌ మైదానంలో తూర్పున నివాస ప్రాంతాలున్న చోట యంత్రాలతో పనులు చేస్తున్నారు. కోట్ల విలువైన ఈ భూమిలో జరుగుతున్న నిర్మాణాలపై ముస్లింలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ వక్ఫ్‌భూమిలో చేస్తోంది ప్రభుత్వ నిర్మాణాలా లేక ప్రైవేట్‌ నిర్మాణాలా?. ప్రభుత్వ నిర్మాణాలైతే అధికారులు ఎవరైనా అనుమతి ఇచ్చారా, ప్రైవేట్‌ నిర్మాణాలైతే వక్ఫ్‌బోర్డు అధికారులు అనుమతి ఇచ్చారా అని ముస్లిం వర్గాలు చర్చించుకొంటున్నాయి. అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహరంపై వక్ఫ్‌బోర్డు అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ముస్లీం వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement