శివరాత్రి ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు
తంబళ్లపల్లె : మాహాశివరాత్రి ఉత్సవాలకు మల్లయ్యకొండకు వచ్చే భక్తులకు ఎక్కడ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తావులేకుండా పోలీసుబందోబస్తు ఏర్పాటు చేస్తామనిమ జిల్లా ఎస్పీ ధీరజ్‌కునుబిల్లి పేర్కొన్నారు. బుధవారం మదనపల్లె డిఎస్పీ మహేంద్రతో కలిసి మల్లయ్యకొండను సందర్శించారు. పూజారులు ఈశ్వరప్ప, మల్లికార్జునలు వారికి స్వాగతం పలికారు. స్వామి దర్శనం కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం కొండపైన మహాశివరాత్రి ఏర్పాట్లపై ఎస్పీ ఆరా తీశారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు సైతం ఎలాంటి అసౌకర్యం కలగకుండా స్వామి దర్శనం చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. మల్లయ్యకొండ కింద అన్నదాన ట్రస్టు ఏర్పాట్లును పరిశీలించారు. ట్రస్టు చైర్మన్ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎస్పీ,డీఎస్పీలను సత్కరించారు.ట్రస్టు ఏర్పాటు, నిర్వహణ తదితర అంశాలపై సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ములకలచెరువు సీఐ వెంకటేశులు, ఎస్.ఐ అనిల్‌కుమార్, సర్పంచుల సంఘం అధ్యక్షులు సుధాకర్‌రెడ్డి, బెంగుళూరు మల్లికార్జునరెడ్డి, ట్రస్టు సభ్యులు భాస్కర్‌రెడ్డి, నారాయణరెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, సుబ్రమణ్యం, మురళి, శివారెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ ధీరజ్‌కునుబిల్లి


